జగన్ కేబినెట్ ఇదే: స్పీకర్‌గా ఆ ఇద్దరి పేర్ల పరిశీలన

First Published Jun 2, 2019, 4:43 PM IST

ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని  విస్తరించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మంత్రివర్గ విస్తరణకు ముందు రోజున వైసీపీ శాసనసభపక్ష సమావేశాన్ని జగన్ ఏర్పాటు చేశారు. కేబినెట్‌లో సామాజిక సమతుల్యాన్ని పాటించనున్నారు. మొదటి నుండి తన వెన్నంటి ఉన్నవారికి కేబినెట్‌లో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

గత నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కేబినెట్‌‌లో ప్రాధాన్యత కల్పించనున్నారు. కనీసం ఒక్కో జిల్లాకు కనీసం ఒక్కరికి చోటు దక్కనుంది. అవసరమైతే ఇద్దరికి చోటు దక్కే అవకాశం లేకపోలేదు.
undefined
కేబినెట్‌లో చోటు కోసం పలువురు ప్రజా ప్రతినిధులు ఇటీవల కాలంలో జగన్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల ఒత్తిడి కారణంగా జగన్ పార్టీ నేతలను కలవలేదు.
undefined
గవర్నర్ ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకుగాను జగన్ శనివారం నాడు హైద్రాబాద్‌కు వచ్చారు. ఆదివారం నాడు ఉదయం కొందరు కీలక నేతలతో జగన్ మంత్రివర్గ కూర్పుపై చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.
undefined
ఈ నెల 7వ తేదీన వైసీపీ శాసనసభపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీన అమరావతిలోని సచివాలయానికి పక్కనే కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.ఇక జిల్లాల వారీగా పార్టీ కీలక నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అదే సమయంలో సామాజిక సమతుల్యతను పాటించనున్నారు.
undefined
శ్రీకాకుళం జిల్లా నుండి ధర్మాన ప్రసాదరావు,కంబాల జోగులు, తమ్మినేని సీతారాంల పేర్లు విన్పిస్తున్నాయి.అయితే తమ్మినేని సీతారాం పేరును స్పీకర్ పదవికి కూడ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.
undefined
ఇక విజయనగరం జిల్లా నుండి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామిలకు చోటు దక్కనుందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. బొత్స సత్యనారాయణకు కోలగట్ల వీరభద్రస్వామిలకు మధ్య వైరం ఉంది.దీంతో వీరిద్దరికి కేబినెట్‌లో చోటు దక్కనుంది.వీరభద్రస్వామికి చోటు దక్కకపోయినా బొత్స సత్యనారాయణకు మాత్రం కేబినెట్‌లో చోటు ఉంటుందని చెబుతున్నారు.
undefined
తూర్పు గోదావరి జిల్లా నుండి పిల్లి సుభాష్ చంద్రబోష్‌, విశ్వరూప్‌, దాడిశెట్టి రాజాలలో ఎవరో ఒకరి చోటు దక్కే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, బాలరాజులలో చోటు దక్కే అవకాశం ఉంది.
undefined
కృష్ణా జిల్లా నుండి కొడాలి నాని , పేర్ని నాని, పార్థసారథి, సామినేని ఉదయబానుల పేర్లు విన్పిస్తున్నాయి. అయితే వీరిలో ఎంతమందికి ఛాన్స్ దక్కుతోందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
undefined
ఇక అనంతపురం జిల్లా నుండి అనంత వెంకట్రామిరెడ్డి, శంకరనారాయణ, కాపు రామచంద్రారెడ్డిల పేర్లు విన్పిస్తున్నాయి. శంకరానారాయణకు బీసీ సామాజిక వర్గం కోటాలో కేబినెట్‌లో బెర్త్ దక్కవచ్చంటున్నారు. మరో వైపు జగన్‌కు అతి సన్నిహితంగా ఉన్న కాపు రామచంద్రారెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
undefined
కర్నూల్ జిల్లా నుండి శిల్పా చక్రపాణిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డిల పేర్లు విన్పిస్తున్నాయి. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డికి జగన్ కేబినెట్ లో బెర్త్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
undefined
నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం కోటాలో అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు.
undefined
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి, మేకపాటి గౌతం రెడ్డిల పేర్లు కూడ ప్రధానంగా విన్పిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం ప్రజా ప్రతినిధులు ఎక్కువగా ఉన్నందున కేబినెట్‌లో బెర్త్ కల్పించడం కత్తి మీద సామేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
undefined
విశాఖ జిల్లా నుండి అవంతి శ్రీనివాస్, అమర్‌నాథ్, ముత్యాలనాయుడుల పేర్లు కూడ కేబినెట్‌లో బెర్త్ కోసం విన్పిస్తున్నాయి. అయితే అమర్ నాద్, అవంతి శ్రీనివాస్ లు ఇద్దరు కూడ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ముత్యాలనాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందినవాడు. అయితే వీరిలో ఎవరికి చోటు దక్కుతోందోననే చర్చ సాగుతోంది.
undefined
ప్రకాశం జిల్లా నుండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ల పేర్లు విన్పిస్తున్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా కూడ పనిచేశాడు. దళిత సామాజిక వర్గం నుండి సురేష్ పేరు కూడ విన్పిస్తోంది.
undefined
చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా పేర్లు కూడ మంత్రివర్గంలో చోటు కోసం జగన్ పరిశీలిస్తున్నట్టుగా విన్పిస్తోంది. ఇదే జిల్లా నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు కూడ ఉన్నాయి. అయితే రెడ్డి సామాజిక వర్గం కావడం కొంత ఇబ్బందిగా చెబుతున్నారు. రోజాకు మహిళ కోటా కింద కేబినెట్‌లో చాన్స్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడ ఉంది.
undefined
కడప జిల్లా నుండి వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ జిల్లా నుండి మైనార్టీకిచెందిన అంజర్ భాషాకు చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మరోకరికి ఛాన్స్ ఇవ్వాలనుకొంటే దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌కు చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.
undefined
గుంటూరు జిల్లా నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి, సుచరిత, మర్రి రాజశేఖర్ ,అంబటి రాంబాబుల పేర్లు విన్పిస్తున్నాయి. దళిత, మహిళ కోటాలో సుచరితకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు. అంబటి రాంబాబుకు కాపు సామాజిక వర్గం కోటా కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు.అయితే అంబటి రాంబాబు పేరును స్పీకర్‌ పదవి కోసం పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
undefined
click me!