జగన్ ఎఫెక్ట్: టీడీపీకి గుడ్‌బై చెబుతున్న నేతలు

First Published Jun 2, 2019, 3:30 PM IST

 అధికారానికి దూరమైనా టీడీపీ నుండి ఒక్కొక్క నేత దూరమౌతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు తమ దారి తాము చూసుకొంటున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన కీలకనేతలకు వైసీపీతో పాటు బీజేపీ నేతలు గాలం వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ కేవలవం 23 స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై టీడీపీ నాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.
undefined
అయితే ఎన్నికలకు ముందు ఇతర పార్టీలకు చెందిన నేతలను టీడీపీలో చేర్చుకోవడంతో పాటు కొంతకాలంగా చోటు చేసుకొన్న పరిణామాలపై కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకొని ప్రత్యర్ధి పార్టీలు కూడ టీడీపీని బలహీనపర్చేందుకు పావులు కదుపుతున్నాయి.
undefined
కర్నూల్ జిల్లాలో టీడీపీ కీలక నేతలుగా ఉన్న కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆలూరు నియోజకవర్గంలో కప్పట్రాళ్ల బొజ్జమ్మ దంపతులు కీలకం. తమకు తెలియకుండానే ఆలూరులో కోట్ల సుజాతమ్మకు టిక్కెట్టు కేటాయించడాన్ని బొజ్జమ్మ దంపతులు సహించలేదు.
undefined
ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి జయరామ్‌కు బొజ్జమ్మ దంపతులు మద్దతు ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన శాలివాహన కార్పోరేషన్ ఛైర్మెన్ తుగ్గలి నాగేంద్ర కూడ టీడీపీని వీడారు. తుగ్గలి నాగేంద్రకు కేఈ కుటుంబానికి మధ్య విబేధాలున్నాయి. తుగ్గలి నాగేంద్ర వైసీపీలో చేరనున్నారు.
undefined
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు దక్కని నేతలు కూడ పార్టీని వీడేందుకు సిద్దమౌతున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత డాక్టర్ వెంకట్రావు కూడ టీడీపీని వీడనున్నారు. ఆయన కృష్ణా జిల్లాలోని ఓ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని భావించారు. కానీ, రెండు దఫాలుగా ఆయనకు చంద్రబాబు టిక్కెట్టు ఇవ్వలేదు.
undefined
సామాజిక సమీకరణాలు, ఇతరత్రా కారణాలను దృష్టిలో ఉంచుకొని వెంకట్రావుకు టిక్కెట్టు కేటాయించలేదని పార్టీ నాయకత్వం చెబుతోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఇతర పార్టీల నేతలు కూడ గాలం వేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.
undefined
టీడీపీకి చెందిన కీలక నేతలపై ఇప్పటికే బీజేపీ నాయకత్వం కేంద్రీకరించినట్టు ప్రచారం సాగుతోంది. ఏడాది లోపుగా ఈ కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు గాను బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.
undefined
ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన టీడీపీ... ఈ ఐదేళ్లలో పార్టీ నుండి బలోపేతం చేయడంతో పాటు పార్టీని కాపాడుకోవడం చంద్రబాబు ముందున్న తక్షణ కర్తవ్యం. అంతేకాదు రెండు మూడు మాసాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది.
undefined
ఇంత కాలం పాటు పదవులు వస్తాయని భావించి కూడ స్థబుగా ఉన్న నేతలు కూడ ఏం చేస్తారనేది కూడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పదేళ్ల పాటు టీడీపీ అధికారానికి దూరంగా ఉంది. 2009 తర్వాత వైసీపీ, టీఆర్ఎస్ కారణంగా టీడీపీ తీవ్రంగా దెబ్బతింది. ఈ రెండు పార్టీలకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వలస వెళ్లారు
undefined
ఈ ఐదేళ్ల కాలంలో కూడ ఏపీ రాష్ట్రంలో కూడ టీడీపీ నుండి అధికార పార్టీతో పాటు బీజేపీలోకి కూడ వలసలు ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమ భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం కొందరు నేతలు పార్టీని వీడే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది.
undefined
click me!