సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు.. సంప్రదాయ పంచెకట్టులో జగన్

First Published Jan 14, 2022, 12:43 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan) నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని తన నివాసంలోని జరిగిన వేడుకల్లో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ పంచెకట్టులో సీఎం జగన్ ఈ వేడుకల్లో కనిపించారు. 

తాడేపల్లిలోని తన నివాసం వద్ద గోశాలలో జరిగిన గో పూజలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. తన నివాస ప్రాంగంణంలో పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ, సంస్కృతిక కార్యక్రమాలను వైఎస్ జగన్ దంపతులు వీక్షించారు. 
 
ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులతో పాటుగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరి ఇంద్రావతి  కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం జగన్.. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. 

ఇక, ఈ రోజు ఉదయం తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు.
 
‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. 

click me!