పేట నీదా నాదా సై: ప్రత్తిపాటికి చుక్కలు చూపిస్తున్న విడుదల రజని

First Published May 13, 2019, 6:05 PM IST

పేట నీదా నాదా సై: ప్రత్తిపాటికి చుక్కలు చూపిస్తున్న విడుదల రజని

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం ఎంతటి హాట్ టాపిక్ అంతే హాట్ టాపిక్ చిలకలూరిపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును చిత్తుగా ఓడిస్తానంటూ శపథం చేసి వైసీపీలో చేరారు విడదల రజని.
undefined
రజని శపథం ఆనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సన్సేషనల్ గా చెప్పుకోవచ్చు. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె టికెట్ విషయంలో పొరపచ్చాలు రావడంతో అమాంతం గోడదూకేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కన్ఫమ్ చేసుకుని పార్టీ కండువా కప్పేసుకున్నారు.
undefined
దీంతో ఈ నియోజకవర్గం కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఆమె గెలుపుపై భారీగా బెట్టింగులు కూడా జరిగాయి. ప్రస్తుతం ఆమె 10వేల ఓట్లు మెజారిటీతో గెలుస్తారంటూ ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి విడదల రజని రాజకీయ ఆరంగేటమే ఒక సంచలనంగా చెప్పుకోవాలి.
undefined
వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవలందిస్తూ చిలకలూరిపేట ప్రజలకు చేరువయ్యారు విడుదల రజని. ఎన్నారై కావడంతో డబ్బు విచ్చల విడిగా ఖర్చుపెట్టడంతోనే కాదు పలు సేవా కార్యక్రమాలతో ఏడాదిలోనే మారుమూల గ్రామాల్లో కూడా తన పేరు మార్మోగేలా చేశారు.
undefined
అంతకుముందే ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే తనకు ఎంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన ప్రత్తిపాటి పుల్లారావును కలిసి టీడీపీలో చేరిపోయారు. చేరిపోవడమే కాదు విశాఖపట్నం వేదికగా జరిగిన టీడీపీ మహానాడులో వైఎస్ జగన్ పై మాటలు తూటాలు పేల్చారు.
undefined
దీంతో సీఎం చంద్రబాబు దృష్టిలో పడ్డారు. వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉన్నాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా టీడీపీలో చేరిన ఆమె ఆయనకే ఎసరు పెట్టాలని చూశారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు.
undefined
2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఎన్నికలకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని చంద్రబాబు ముందు చెప్పినా టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. విడదల రజని వ్యవహారంతో షాక్ తిన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు కలవరపాటుకు గురయ్యారు.
undefined
టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె ప్రత్తిపాటిని ఓడిస్తానంటూ శపథం చేశారు. విడదల రజని చేసిన శపథం ఆనాడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిందనే చెప్పాలి. ఆ తర్వాత కొన్నాళ్లకు వైసీపీ గూటికి చేరిపోయారు. విశాఖపట్నంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
undefined
విడదల రజని వైసీపీలో చేరిన తర్వాత జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగాయి. 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్న మర్రి రాజశేఖర్ కు చెక్ పెట్టడంతో జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు రజని.
undefined
జిల్లా వైసీపీ అధ్యక్షుడు హోదాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను సంప్రదించకుండా ఆమె వైసీపీలో చేరిపోయారు. వెంటనే చిలకలూరిపేటలో ప్రెస్మీట్ పెట్టి తానే నియోజకవర్గ ఇంచార్జ్ అంటూ ప్రకటించేసుకున్నారు. ఈ వ్యవహారంతో మర్రి రాజశేఖర్ అలకబూనారు.
undefined
అయితే వైఎస్ జగన్ బుజ్జగించడంతో మర్రి రాజశేఖర్ సైలెంట్ కావాల్సి వచ్చింది. మర్రి రాజశేఖర్ శాంతించడంతో విడదల రజని తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. మర్రి రాజశేఖర్ సూచనలు, సలహాలతో మరింత దూసుకుపోయారు.
undefined
నిత్యం ప్రజలతో ఉంటూ జెట్ స్పీడ్ తో దూసుకుపోయారు. రాజకీయాల్లోకి తీసుకువచ్చిన గురువు పత్తిపాటి పుల్లారావు గుండెల్లో రైల్లు పరుగెట్టిస్తున్నారట. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు 2009, 2014 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ఆయన హ్యాట్రిక్ కోసం ప్రయత్నించారు.
undefined
2014 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మర్రి రాజశేఖర్ పై ఏకంగా 50వేల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడదల రజని ఎన్నారై కావడంతో ఆమె డబ్బులు ఖర్చు చెయ్యడంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఢీకొట్టారని తెలుస్తోంది.
undefined
అంతేకాదు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకావడంతో వారందర్నీ ప్రభావితం చేసారని ప్రచారం. అంతేకాదు పోల్ మేనేజ్ మెంట్ చెయ్యడంలో ఆమె ప్రత్తిపాటి కంటే ముందు వరుసలో ఉన్నారని వైసీపీ చెప్తోంది.
undefined
బీసీ అనుకూల ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత, మహిళా సెంటిమెంట్, నవరత్నాలు, జగన్ కు ఒక ఛాన్స్ ఇవ్వాలనే భావన ఆమెకు కలిసి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమెకు సోషల్ మీడియాతో చాలా సహాయం చేసిందని టాక్.
undefined
దీంతో ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని వైసీపీ భావిస్తుంటే కాదు తమ నేతే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది టీడీపీ. విడదల రజని ఎంత ప్రభావితం చేసినా టీడీపీ సంప్ర‌దాయ ఓటింగ్ చెక్కు చెదరలేదని, ప్రజలు ప్రత్తిపాటి వెంటే ఉన్నారని చెప్తున్నారు.
undefined
మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి, అందర్నీ కలుపుకుపోయే స్వభావం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపు కలిసి వస్తాయని టీడీపీ భావిస్తోంది. మెుత్తానికి గెలుపై అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది.
undefined
తమదే గెలుపు అంటే తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు కోట్లలో బెట్టింగ్ లు సైతం జరుగుతున్నాయి. మెుత్తానికి రాజకీయాల్లో సంచలనంగా మారిన విడదల రజని తాను చేసిన శపథం నెరవేర్చుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.
undefined
click me!