టీడీపీ గన్నవరం ఇంచార్జీగా యార్లగడ్డ: పార్టీలో చేరిన వెంటనే పదవి

First Published | Aug 24, 2023, 2:13 PM IST

టీడీపీలో చేరిన వెంటనే  ఆ పార్టీ గన్నవరం అసెంబ్లీ ఇంచార్జీగా యార్లగడ్డ వెంకటరావును నియమించింది ఆ పార్టీ. 

టీడీపీ గన్నవరం ఇంచార్జీగా యార్లగడ్డ: పార్టీలో చేరిన వెంటనే పదవి

టీడీపీ గన్నవరం అసెంబ్లీ ఇంచార్జీగా  యార్లగడ్డ వెంకటరావును  నియమించారు.   ఈ నెల  20వ తేదీన  టీడీపీ చీఫ్ చంద్రబాబుతో  యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు.   గన్నవరం అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.పార్టీలో చేరిక తదితర విషయాలపై మాట్లాడారు. 

టీడీపీ గన్నవరం ఇంచార్జీగా యార్లగడ్డ: పార్టీలో చేరిన వెంటనే పదవి

ఈ నెల  23న  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరారు. తనతో పాటు తన అనుచరులు కూడ  టీడీపీ  తీర్థం పుచ్చుకున్నారు. యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరిన  తర్వాత  ఆయనను గన్నవరం అసెంబ్లీ ఇంచార్జీగా  ఆ పార్టీ నియమించింది. 

Latest Videos

టీడీపీ గన్నవరం ఇంచార్జీగా యార్లగడ్డ: పార్టీలో చేరిన వెంటనే పదవి

ఈ నెల  18వ తేదీన  విజయవాడలో తన అనుచరులతో యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు.  తనకు  అపాయింట్ మెంట్ ఇవ్వాలని మీడియా వేదికగా  యార్లగడ్డ వెంకటరావు కోరారు. దీంతో ఈ నెల  20న యార్లగడ్డ వెంకటరావుకు  చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇచ్చారు. 

టీడీపీ గన్నవరం ఇంచార్జీగా యార్లగడ్డ: పార్టీలో చేరిన వెంటనే పదవి

అంతకుముందే  ఈ నెల  13న  గన్నవరంలో కూడ  యార్లగడ్డ వెంకటరావు  అనుచరులతో సమావేశమయ్యారు. గన్నవరం అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వాలని వైఎస్ జగన్ ను కోరారు.  అయితే  ఈ సమావేశాన్ని వైసీపీ నాయకత్వం లైట్ గా తీసుకున్నట్టుగా కన్పించింది.  పార్టీ నేతలు కూడ యార్లగడ్డ వెంకటరావు  తీరుపై అసంతృప్తితో మాట్లాడారు.ఈ పరిణామాలతో  వైఎస్ఆర్‌సీపీని వీడాలని యార్లగడ్డ వెంకటరావు నిర్ణయం తీసుకున్నారు. 

టీడీపీ గన్నవరం ఇంచార్జీగా యార్లగడ్డ: పార్టీలో చేరిన వెంటనే పదవి

2019  అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్‌ఆర్‌సీపీ గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి యార్లగడ్డ వెంకటరావు పోటీ చేశారు.  అయితే  ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ చేతిలో  యార్లగడ్డ వెంకటరావు  ఓటమి పాలయ్యారు.  2019 ఎన్నికల తర్వాత  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీకి జై కొట్టారు.  వల్లభనేని వంశీ వైఎస్ఆర్‌సీపీ లో చేరడాన్ని అప్పట్లో యార్లగడ్డ వెంకటరావు  వ్యతిరేకించారు. కానీ  పార్టీ నాయకత్వం వంశీని పార్టీలోకి ఆహ్వానించింది. 

టీడీపీ గన్నవరం ఇంచార్జీగా యార్లగడ్డ: పార్టీలో చేరిన వెంటనే పదవి

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో  తలదూర్చవద్దని  యార్లగడ్డ వెంకటరావుకు వైఎస్ఆర్‌
సీపీ నాయకత్వం సూచించింది. అంతేకాదు తన  అనుచరులపై  వంశీ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని  యార్లగడ్డ వెంకటరావు  పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిణామాల్లో తనకు  న్యాయం దక్కలేదని  యార్లగడ్డ వెంకటరావు అసంతృప్తితో  వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

టీడీపీ గన్నవరం ఇంచార్జీగా యార్లగడ్డ: పార్టీలో చేరిన వెంటనే పదవి

గత ఎన్నికల సమయంలో  అమెరికా నుండి వచ్చిన  యార్లగడ్డ వెంకట రావు  గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేశారు. పెనమలూరు నుండి పోటీ చేయాలని యార్లగడ్డ వెంకటరావు భావించారు. కానీ  వైసీపీ నాయకత్వం  గన్నవరం నుండి  పోటీ చేయాలని యార్లగడ్డ వెంకటరావుకు సూచించింది. దీంతో  యార్లగడ్డ వెంకటరావు పార్టీ సూచనతో  పెనమలూరు కాకుండా  గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేశారు.

click me!