వారికి ఈ వ్యవహారం ఇష్టం లేకపోవడంతో మరో యువతితో ఏడాది కిందట నాగశేషుకు వివాహం చేశారు. ఈ విషయం డిబేరాకు తెలియదు. ఇటీవలే ఈ విషయం తెలియడంతో నాగశేషును నిలదీసింది. తన దగ్గర తీసుకున్న డబ్బు, గొలుసు ఇచ్చేసేయాలని తెలిపింది. ఎన్నిసార్లు అడిగినా నాగశేషు వాటిని తిరిగి ఇవ్వలేదు. దీంతో డిబేరా అతనిమీద కక్ష పెంచుకుంది.