తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జనసేన, బీజేపీల తరపున ఏ పార్టీ అభ్యర్ధి బరిలోకి దిగుతారనేది ఇంకా స్పష్టం కాలేదు. రెండు పార్టీలు ఈ స్థానం నుండి పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నాయి. ఉమ్మడి అభ్యర్ధి ఈ స్థానం నుండి బరిలోకి దిగుతారని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఇటీవలనే ప్రకటించారు.
undefined
తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీకి జనసేన ఆసక్తిని చూపుతోంది. గత ఎన్నికల సమయంలో ఈ స్థానాన్ని బీఎస్పీకి జనసేన కేటాయించింది. గత ఎన్నికల్లో లెఫ్ట్ బీఎస్పీతో కలిసి జనసేన పోటీ చేసింది. తిరుపతి ఎంపీ స్థానం నుండి బీఎస్పీ అభ్యర్ధి పోటీ చేశారు. బీఎస్పీ అభ్యర్ధికి 20,971 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బొమ్మిన శ్రీహరి రావుకు 16, 125 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఈ స్థానంలో నోటాకు 25, 781 ఓట్లు దక్కాయి.
undefined
దీంతో ఈ స్థానం నుండి పోటీ చేయడానికి జనసేన ఆసక్తిని చూపుతోంది. జనసేనకు ఈ నియోజకవర్గంలో క్యాడర్ ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ కంటే తమకు ఈ నియోజకవర్గంలో పట్టుందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు.
undefined
తిరుపతి ఎంపీ స్థానం నుండి పోటీ చేసే విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ గత మాసంలో చర్చించారు. అయితే ఈ విషయమై బీజేపీ జాతీయ నాయకత్వం నుండి జనసేనకు ఎలాంటి హామీ లభించలేదు.
undefined
ఈ స్థానం నుండి పోటీ చేయడానికి బీజేపీ కూడా ఆసక్తితో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న మెరుగైన ఫలితాలు తమ రాష్ట్రంలో కూడ వస్తాయనే ధీమాతో ఆ పార్టీ నాయకత్వం ఉంది.
undefined
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చూపాలని బీజేపీ నాయకత్వం ఉత్సాహంతో ఉంది. తిరుపతి ఉప ఎన్నికలకు వైసీపీ, టీడీపీలు ఇప్పటికే తమ అభ్యర్ధులను కూడ ప్రకటించాయి.
undefined
వైసీపీ నుండి డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ ప్రకటించింది. టీడీపీ నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేరును చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. బీజేపీ, జనసేనల నుండి ఎవరు పోటీ చేస్తారనే విషయమై ఇంకా తేలాల్సి ఉంది.
undefined
ఈ రెండు పార్టీలు తిరుపతి స్థానంలో పోటీ చేసే విషయమై ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. అయితే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని జనసేన ఈ సందర్భంగా బీజేపీ నేతల ముందు ప్రస్తావిస్తోందని సమాచారం.
undefined
తిరుపతి స్థానంలో గతంలో 1.22 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 1.83 శాతం ఓట్లు దక్కాయి. జనసేన బలపర్చిన బీఎస్పీకి1.60 శాతం వచ్చాయి.
undefined
1999లో ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధి విజయం సాధించాడు. ఆ సమయంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఈ స్థానంలో పోటీ చేసిన బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.
undefined
దీంతో ఈ స్థానం నుండి గతంలో తాము విజయం సాధించడంతో గతంలో మెరుగైన ఓట్లు సాధించినందు పోటీ చేస్తామని ఆ పార్టీ నాయకత్వం చెబుతోంది.
undefined
45 బూత్ లెవల్ కమిటీలను బీజేపీ ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేసింది. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు తెలంగాణతో పాటు ఏపీపై కేంద్రీకరించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.
undefined
జనసేనతో బీజేపీకి పొత్తుంది. దీంతో తిరుపతి ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ చేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
undefined