ఊహించని ఫలితాలు, విజయం మనదే: మంత్రులతో బాబు

First Published May 15, 2019, 10:57 AM IST

ఈ ఎన్నికల్లో టీడీపీ  భారీ విజయాన్ని  సాధించనుందని  చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు.  ఎవరూ కూడ ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు మంత్రివర్గసమావేశానికి ముందు మహానాడు నిర్వహణకు సంబంధించి పార్టీ సీనియర్లు, మంత్రులతో చంద్రబాబునాయుడు చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఈ విషయమై స్పందించారు.
undefined
పేద ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారని బాబు ఈ సమావేశంలో తేల్చి చెప్పారు. టీడీపీకే విజయం దక్కనుందన్నారు. ఈ విషయంలో ఎవరూ కూడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
undefined
పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందాయని.....దీని ప్రభావం ఎన్నికలపై తప్పకుండా ఉంటుందని ఓ మంత్రి అభిప్రాయపడ్డారు. తన నియోజకవర్గంలో చివరి మూడు మాసాల్లో రూ. 98 కోట్లు సంక్షేమ పథకాల రూపంలో లబ్దిదారులకు చేరాయని ఓ మంత్రి ఈ సమావేశంలో చెప్పారు.దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని ఆయన చెప్పారు.
undefined
పెన్షన్ తీసుకొంటున్న లబ్దిదారుల్లో 20 శాతం టీడీపీకి ఆదిక్యత లభించే అవకాశం ఉందని, మహిళ ఓటర్లలో కూడ టీడీపీ వైపే మొగ్గు చూపే వారి సంఖ్య కూడ ఎక్కువగానే ఉందని మరో మంత్రి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.
undefined
మీరు అనుకొన్న దాని కంటే కూడ ఫలితాలు బాగుంటాయని కూడ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మరో వైపు మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల ఫలితాల మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడ బాబు స్పందించారు. ఎన్నికల ఫలితాల గురించి మీ చెవిలో చెబుతానని బాబు ఆది నారాయణరెడ్డిని ఉద్దేశించి చమత్కరించినట్టు సమాచారం.
undefined
మంత్రులతో జరిగిన సమావేశంలో జాతీయ రాజకీయాలపై కూడ బాబు చర్చించినట్టుగా సమాచారం. దేశంలో ఈ దఫా గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందని బాబు అభిప్రాయపడ్డారు. మోడీకి ప్రాంతీయ పార్టీలు మద్దతును ఇచ్చే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
undefined
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మోడీకి బదులుగా రాజ్‌నాథ్, గడ్కరీలను బీజేపీ తెరమీదికి తీసుకొచ్చే అవకాశాలు కూడ లేకపోలేదని కొందరు మంత్రులు ఈ సమావేశంలో అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.
undefined
బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ రాదని బాబు కుండబద్దలు కొట్టారు. బీజేపీ వ్యతిరేక కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన తేల్చి చెప్పారు. మోడీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూడ ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
undefined
click me!