చంద్రబాబు, జగన్ ధీమా అదే: పవన్ కల్యాణ్ అంచనా ఇదీ...

First Published May 14, 2019, 6:22 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తై దాదాపు నెలరోజులు దాటేసింది. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీలు నరాలు తెగే ఉత్కంఠతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలైతే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తై దాదాపు నెలరోజులు దాటేసింది. ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీలు నరాలు తెగే ఉత్కంఠతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇక అధికార, ప్రతిపక్ష పార్టీలైతే ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
undefined
ఈ ఎన్నికల్లో కూడా తామే కింగ్ అంటూ టీడీపీ ధీమాగా ఉంది. రెండోసారి కూడా ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారంటూ టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేకాదు అందుకు సంబంధించి ముహూర్తాలు కూడా పెట్టించేసుకుంది.
undefined
ఇక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈసారి తమదే అధికారం అంటూ ధీమాగా ఉంది. తామే కింగ్ అంటూ చెప్పుకుంటోంది. ఈసారి ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ గట్టిగా నమ్ముతోంది వైసీపీ.
undefined
అంతేకాదు వైసీపీలో కీలక నేతలు తమకు మంత్రి పదవులు వస్తాయంటూ ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. కొందరు అభిమానులైతే కాబోయే మంత్రి, కాబోయే ఎమ్మెల్యే అంటూ స్టిక్కర్లు ఫ్లెక్సీలు వేసుకుని మరీ హల్ చల్ చేస్తున్నారు.
undefined
అధికార ప్రతిపక్ష పార్టీలు ధీమాగా ఉంటే జనసేన పార్టీ మాత్రం మౌనంగా ఉండిపోయింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం దగ్గరకు వచ్చే కొద్దీ మౌనం మాట్లాడుతుంది అన్నట్లు చాలా ధీమా వ్యక్తం చేస్తోంది జనసేన పార్టీ.
undefined
ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం జనసేనదేనంటూ ఇప్పటికీ కార్యకర్తలకు చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న జనసేన పార్టీ నేతలు ఆకస్మాత్తుగా వాయిస్ రేజ్ అవ్వడానికి కారణాలు లేకపోలేదని తెలుస్తోంది.
undefined
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పుకుంటోంది.
undefined
ఇకపోతే ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ తీవ్ర ప్రభావం చూపిందని ఫలితంగా అటు తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గానీ తెలుగుదేశం పార్టీ గానీ కింగ్ లు కాలేవని తేల్చిచెప్తున్నారు జనసైనికులు.
undefined
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కింగ్ మేకర్ కాబోతుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అంతేకాదు కర్ణాటక తరహా ప్రభుత్వం ఏర్పడిన ఆశ్చర్యపడనక్కర్లేదని చెప్పుకొస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపేందుకు కాంగ్రెస్ పార్టీ, అటు జేడీఎస్ పార్టీలు యుద్ధానికి దిగాయి.
undefined
అయితే బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ కు కాస్త దూరంలో ఆగిపోయింది. జేడీఎస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించింది.
undefined
బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపాల్సిందేనని అనుకున్న కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో నిలిచిన జేడీఎస్ ను తీసుకు వచ్చి కింగ్ ను చేశాయి. అలాంటి పరిస్థితి ఏపీలో కూడా రాకపోదని జనసేన స్పష్టం చేస్తోంది.
undefined
తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాలు దక్కపోతే జనసేన పార్టీ ఆటోమెటిక్ గా కింగ్ మేకర్ అవుతుందని ఫలితంగా పవన్ కళ్యాణ్ ఏపీ కుమార స్వామి అయ్యే ఛాన్స్ ఉందంటూ ధీమాలో ఉంది జనసేన పార్టీ.
undefined
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ వార్ వన్ సైడ్ అంటోంది. అటు వైసీపీ సైతం ఈసారి ఏపీ మాదేనంటూ ధీమాగా ఉంది. తాజాగా జనసేన పార్టీ కింగ్ మేకర్ తామేనంటూ ప్రచారం చేసుకుంటోంది.
undefined
మరీ ఈ ముగ్గురు అధినేతల అంఛనాలు ఏం కానున్నాయి, పవన్ కళ్యాణ్ నిజంగానే ఏపీలో కింగ్ మేకర్ కాబోతున్నారా, వార్ వన్ సైడ్ అనేది అసంభవమా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.
undefined
click me!