అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో ఆశ కన్వెన్షన్ సెంటర్‌లో
టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి, అంత్యోదయ ప్రతిష్ఠాన్ సహకారంతో రూపొందించిన ITCX 2025 ప్రపంచవ్యాప్తంగా దేవాలయ పర్యావరణ వ్యవస్థలను నెట్‌వర్క్ చేయడానికి, బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి ఒక వేదికను అందిస్తూ ముందుకు సాగుతోంది. ఈ సమావేశంలో దాదాపు 58కి పైగా దేశాల్లోని సుమారు 1581 భక్తి సంస్థలు పాల్గొంటున్నాయి. 111+ స్పీకర్లు, 15 వర్క్‌షాప్‌లు & నాలెడ్జ్ సెషన్‌లతో 60+ స్టాల్‌లను కలిగి ఉంది.
తిరుపతిలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో ఆశ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన "గోల్డ్ ఏటీఎం" అందరిని ఆకర్షిస్తోంది.