Published : Sep 27, 2021, 05:36 PM ISTUpdated : Sep 27, 2021, 05:40 PM IST
తిరుమలలో త్వరలో జరగనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం వైయస్.జగన్‌ను ఆహ్వానించారు తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి. టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి (ఎండోమెంట్స్) జి వాణీ మోహన్ తో పాటు సీఎంనును కలిసిన సుబ్బారెడ్డి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానంలో కళ, సాంస్కృతిక, ఆరోగ్య వేదిక(ధర్మపధం)ను ప్రారంభించిన సీఎం జగన్. ఈ సందర్భంగా దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా సీఎంను ఆహ్వానించిన ఆలయ ఈవో. ఆ తర్వాత సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం దేవస్ధానాల కార్యనిర్వహణాధికారులు సీఎంను ప్రసాదాలు అందజేసారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవస్ధానం దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు ఆలయఈవో లవన్న.