Cyclone Gulab:ఏపీలో వర్ష భీభత్సం... మృతికి రూ.5లక్షలు, బాధితులకు వెయ్యి: సీఎం జగన్ ప్రకటన

Arun Kumar P   | Asianet News
Published : Sep 27, 2021, 02:10 PM ISTUpdated : Sep 27, 2021, 02:14 PM IST

గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. 

PREV
17
Cyclone Gulab:ఏపీలో వర్ష భీభత్సం... మృతికి రూ.5లక్షలు, బాధితులకు వెయ్యి: సీఎం జగన్ ప్రకటన

అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ఏపీలో భీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాను ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ హెచ్చరించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

27

తుఫాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ పరిహారం చెల్లించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు రూ. వెయ్యి చొప్పున అందించాలని ఆదేశించారు. 
 

37

అవసరమైన అన్నిచోట్ల సహాయక శిబిరాలను తెరవాలని.. సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాల ఏర్పాటు, సహాయక శిబిరాల్లో నాణ్యమైన ఆహారం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. వర్షం తగ్గుముఖం పట్టగానే విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

47

భారీ వర్షాలతో పంటను నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాలని సీఎం సూచించారు. పంటనష్టం అంచనా వేసి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు.

57

సీఎంతో జరిగిన సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు కలెక్టర్ జె. నివాస్. జిల్లాలో 44 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైందని కలెక్టర్ సీఎంకు తెలిపారు. జి. కొండూరు మండలం లో ఒక రోడ్డు కోతకు గురైందని... మిగిలిన అన్ని చోట్ల సాధారణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రస్తుత వర్షాలు కురుస్తున్న దృష్ట్యా సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్ని శాఖల అధికారులను ముఖ్యంగా రెవెన్యూ, ఆర్ అండ్ బి,పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్యశాఖలను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రికి కలెక్టర్ నివాస్ వివరించారు.
 

67

సీఎం జగన్ చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా నుండి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గుప్త, కలెక్టర్ శ్రికేశ్ బి. లాటకర్, ఎస్పీ అమిత్ బర్ధర్, జెసిలు సుమిత్ కుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

77

సీఎంతో పాటు ఈ సమావేశంలో పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి (డిజాస్టర్‌ మేనేజిమెంట్‌) ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, అడిషనల్‌ డీజీ ఏ రవిశంకర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, సివిల్‌ సఫ్లయిస్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

click me!

Recommended Stories