ఆ ఉద్యోగులకు జీతం కట్: టీటీడీ సంచలన నిర్ణయం

First Published | Jul 1, 2021, 2:21 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు టీటీడీ తన వంతు పాత్ర పోషించాలని భావిస్తోంది. ఈ మేరకు  వ్యాక్సినేషన్ కు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది.

కరోనా వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు వేతనాలు చెల్లించవద్దని టీటీడీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఉద్యోగులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేయిస్తోంది.
టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 45 సంవత్సరాలు పైబడి ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారికి జీతాలు నిలిపివేయాలని ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. చాలామంది ఉద్యోగులు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని గుర్తించిన టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

జులై 7 లోపు ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకుని సంబంధిత సర్టిఫికెట్లను ఆయా డిపార్ట్‌మెంట్లలో అందజేయాలని ఈవో ఆదేశించారు. జులై 7 లోపు వ్యాక్సిన్ వేసుకున్న ఉద్యోగులకు జూలై 8న జీతాలు చెల్లించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. త్వరలోనే సర్వదర్శనం కూడా అమలు చేయనున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు అలసత్వం వహిస్తుండటంతో ఈవో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారానే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వేసుకోవడమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ వేసుకోవాలని ఉద్యోగులను టీటీడీ ఆదేశించింది.

Latest Videos

click me!