అమరావతి: ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ లో పాల్గొననున్న తెలుగు క్రీడాకారులకు ఏపీ సీఎం జగన్ బెస్ట్ విషెస్ తెలిపారు. అంతేకాకుండా ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
undefined
కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడ్డ తర్వాత ఈ ఏడాది జులై 23 నుండి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో సమ్మర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇందులో భారతదేశం తరపున ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలు పాల్గొంటున్నారు.
undefined
ఇలా టోక్యో ఒలింపిక్స్ కోసం సంసిద్దమవుతున్న తెలుగు క్రీడాకారులను బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో క్రీడాకారులను కలుసుకున్న సీఎం వారికి బెస్ట్ విషెస్ తెలిపారు. అలాగే ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్ అందజేశారు.
undefined
విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు పివి సింధుకు ప్రభుత్వం రెండెకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ భూ కేటాయింపుకు సంబంధించిన జీవో పత్రాలను స్వయంగా ముఖ్యమంత్రే సింధుకి అందజేశారు.
undefined
చిత్తూరు జిల్లాకు చెందిన ఇండియన్ ఉమెన్స్ హకీ ప్లేయర్ రజనీ బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా జగన్ ను కలవలేకపోయారు. అయితే ఆమె తరపున కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
undefined
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్ ఉద్యోగులు వెంకట రమణ, జూన్ గ్యాలియో, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
undefined