తెలుగమ్మాయిలకు చంద్రబాబు బంపరాఫర్ ... ఇంటివద్దే ఉంటూ లక్షలకు లక్షలు సంపాదించొచ్చు

Published : Feb 12, 2025, 04:44 PM ISTUpdated : Feb 12, 2025, 04:57 PM IST

Work From Home : ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్భుత అవకాశం ఇచ్చారు. ఇంటిపట్టునే ఉంటూ లక్షలకు లక్షలకు సంపాదించే అవకాశం కల్పిస్తున్నారు.  

PREV
13
తెలుగమ్మాయిలకు చంద్రబాబు బంపరాఫర్ ... ఇంటివద్దే ఉంటూ లక్షలకు లక్షలు సంపాదించొచ్చు
working women

Work Frome Home : ఒకప్పుడు ఐటీ ఉద్యోగులకు మాత్రమే పరిచయమున్న పదం వర్క్ ఫ్రమ్ హోమ్. ఐటీ ఉద్యోగులకు ఇంటినుండి పనిచేసుకునే అవకాశం కల్పించేవి కొన్ని కంపనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఉపయోగించేవి. కానీ కరోనా  కారణంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటినుండే పని) కాన్సెప్ట్ అందరికీ పరిచయం అయ్యింది. లాక్ డౌన్ సమయంలో అన్ని కంపనీలు ఈ వర్క్ ఫ్రమ్ విధానానికి మారాయి... ఇది బాగుండటంతో చాలా సంస్థలు కరోనా తర్వాత కూడా ఈ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. 

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మరింత ప్రోత్సహించేందుకు సిద్దమయ్యింది. మరీముఖ్యంగా మహిళలకు అటు ఇంటి బాధ్యతలు, ఇటు వృత్తి బాధ్యతలు చేసుకునేందుకు ఈ వర్క్ ప్రమ్ హోమ్ కాన్సెప్ట్ చాలా ఉపయోగకరంగా వుంటుంది... కాబట్టి వారికి అనుకూలంగా వుండేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటికే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోనే వీలైనంత ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలు చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం స్పష్టం చేసారు. 

నిన్న (ఫిబ్రవరి 11) మంగళవారం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఆండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేసారు.ఇందులో మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ వర్కింగ్ ఉమెన్స్ కు ఆఫీస్, ఇంటి పనుల్లో ఎదురవుతున్న ఒత్తిడి తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించారు. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

23
Work From Home

వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చంద్రబాబు కామెంట్స్ : 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "వర్క్ ఫ్రమ్ హోమ్"  కు సంబంధించి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోందని చంద్రబాబు తెలిపారు. STEM (సైన్స్, టెక్నాలజి, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్) రంగాల్లో సత్తా చాటుతున్న మహిళలు, అమ్మాయిలకు మరింత మంచి అవకాశాలను కల్పించే వర్క్ కల్చర్ సృష్టిస్తున్నట్లు వెల్లడించారు. వారి కెరీర్ లో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని సీఎం స్పష్టం చేసారు.   

కరోనా మహమ్మారి అన్నిరంగాల్లో వర్క్ స్టైల్ ని మార్చింది... టెక్నాలజీ అందుబాటులో వుండటంతో 'వర్క్ ఫ్రమ్ హోమ్' సాధ్యమయ్యింది. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్‌లు (CWS), నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ (NWS) వంటి భావనలు వ్యాపారాభివృద్దికి తోడ్పటమే కాదు ఉద్యోగులు సౌకర్యవంతంగా పని చేసుకునే వీలు కల్పించాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగుల పనిలో కూడా నాణ్యత పెరిగినట్లు తెలుస్తోందని చంద్రబాబు అన్నారు.

ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల పర్సనల్, ప్రొఫెషనల్ జీవితాలను బ్యాలన్స్ చేసుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఇలాంటి సౌకర్యవంతమైన పని విధానాన్ని కల్పించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటి (Information Technology) ఆండ్ జిసిసి (Global Capability Centers) పాలసీ 4.0 అందుకు తగినట్లుగానే ఉంటుందని...  ఇది  గేమ్ చేంజింగ్ కానుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లోనే కాదు చిన్నచిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో కూడా ఐటీ కార్యాలయాల ఏర్పాటును ప్రోత్సహిస్తామని... అందుకు తగిన స్థలాలను, ఇతర ప్రోత్సాహకాలను డెవలపర్‌లకు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడానికి ఐటీ, జిసిసి సంస్థలకు మద్దతు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. 

తమ ప్రభుత్వ చొరవ మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు సహాయపడుతుందని చంద్రబాబు అన్నారు. ఈ రిమోట్, హైబ్రిడ్ వర్క్ ఆప్షన్స్ తో మహిళా ఉద్యోగులు మరింత ప్రొడక్టివ్ గా పని చేసుకోగలరని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

33
WhatsApp Governance

టెక్నాలజీ సాయంతో పాలనా విప్లవం సృష్టిస్తున్న చంద్రబాబు : 

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుటారు. దశాబ్దాల క్రితమే ఐటీ రంగం ఏ స్థాయిలో అభివృద్ది చెందుతుందో గుర్తించారు చంద్రబాబు... అందుకు తగినట్లుగా హైదరాబాద్ లో ఏర్పాట్లు చేసారు. ఇప్పుడు ఈ నగరం ఐటీ హబ్ గా మారడానికి చంద్రబాబు వేసిన పునాదులే కారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

ఇలా టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ అప్ డేట్ గా వుండే చంద్రబాబు తాజాగా ఏపీలో వాట్సాఫ్ పాలనను తీసుకున్నారు. సాధారణంగా వాట్సాప్ ను చాటింగ్ కోసం ఉపయోగిస్తుంటారు... కానీ చంద్రబాబు మాత్రం దాన్ని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందంచడానికి ఉపయోగిస్తున్నారు.  ఇందుకోసం వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకువచ్చింది.  

గతేడాది ఈ వాట్సాప్ గవర్నెన్స్ దిశగా ఏర్పాట్లు చేసింది చంద్రబాబు ప్రభుత్వం... అక్టోబ్ లో మెటా సంస్ధతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించారు. తొలిదశలో మొత్తం 161 రకాల పౌరసేవలను ఈ వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్దమయ్యారు. ఇలా జనవరి 30 నుండి ఏపీ పాలనలో వాట్సాప్ ఓ భాగమయ్యింది. 

Read more Photos on
click me!

Recommended Stories