ఆంధ్ర ప్రదేశ్ లో రేర్ ఎర్త్స్ ఆనవాళ్లు :
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఈ అరుదైన భూమి మూలకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతపురంలోని శిలలను అత్యంత సూక్ష్మంగా పరిశీలించామని.. వాటిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్టు నిర్ధారించుకున్నామని హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇక్కడ లాంతనం, సెరియం, ప్రాసియోడైమియం, నియోడైమియం, ఇట్రియం, హాఫ్నియం, టాంటాలం, నియోబియం, జిర్కోనియం, స్కాండియం వంటి మూలకాలు ఉంటాయని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో పోల్చుకుంటే 2050 నాటికి ఆర్‌ఈఈల అవసరం 26 రెట్లు పెరుగుతుందనేది నిపుణుల మాట. డిజిటలైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ మూలకాల వినియోగం పెరుగుతుందని అంటున్నారు. వీటి డిమాండ్ బంగారాన్ని మించి పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.