300, 400 రూపాయలకే కాదు, తిరుమలకు ఫ్రీగా కూడా నెయ్యిని ఇవ్వొచ్చు ... ఎలాగో తెలుసా?

First Published Sep 27, 2024, 6:09 PM IST

కేవలం 300,400 రూపాయలకే కిలో నెయ్యిని తిరుమలకు ఎలా సరఫరా చేస్తున్నారు అనే అనుమానం మీకు కలగొచ్చు. అయితే ఎలాంటి డబ్బులు లేకుండా కూడా వేల టన్నుల నెయ్యిని సరఫరా చేయవచ్చు.  అదెలాగో తెలుసా? 

Tirumala Laddu

Tirumala Laddu Controversy : భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక ధార్మిక సంస్థగా తిరుమల దేవాలయం నిలిచింది. ప్రతిరోజు తమ ఆరాధ్యదైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తులు హుండీలో వేసే ఆదాయమే కోట్లలో వుంటుంది. ఇక  దాతల విరాళాలు, లడ్డులు, తలనీలాల అమ్మకం వంటి పలు మార్గాల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంకు ఆదాయం వస్తుంది.ఇలా ఇప్పటికే ఆ తిరమల వెంకన్న రిచ్చెస్ట్ దేవుడిగా గుర్తింపుపొందారు. ఇలాంటి ధనిక దేవాలయంలో భక్తులకు అమ్మే లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ జరుగుతున్న ప్రచారం తీవ్ర దుమారం రేపుతోంది. 
 

Tirumala Laddu

తిరుమల శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డులో జంతువుల కొవ్వుతో కల్తి చేసిన నెయ్యిని వాడారంటూ గత వైసిపి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి... తిరమల లడ్డు చుట్టు వివాదం రాజుకుంది. వైసిపి అధినేత వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. తమ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసే వ్యవహారాలేమీ జరగలేవు ... చంద్రబాబు కావాలనే ఈ దేవుడితో రాజకీయాలు చేస్తున్నారని వైసిపి మండిపడుతోంది. 

ఇలా టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఓవైపు...  వైసిపి ఒక్కటి ఓవైపు నిలిచి తిరుమల విషయంలో మాటల యుద్దం సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం బైటపడింది. సాధారణంగా మార్కెట్ లో కిలో నెయ్యి ధర వెయ్యి రూపాయల పైనే వుంది... కానీ తిరుమలకు కేవలం రూ.300, రూ.400 కు నెయ్యిని ఎలా సరఫరా చేసారు? ఈ ధర కూడా కల్తీ అనుమానాలను మరింత పెంచుతోంది. కానీ ఏమాత్రం కల్తీ లేకుండానే స్వచ్చమైన నెయ్యిని ఫ్రీగా కూడా ఇవ్వొచ్చు. అదెలాగో తెలుసుకుందాం. 
 

Latest Videos


Tirumala Laddu

పాలు కొంటే నెయ్యి ఫ్రీ :

మార్కెట్ లో లీటర్ పాల ధర రూ.60 నుండి రూ.70 రూపాయలుగా వుంది. ఎలాంటి నీరు కలపకుండా స్వచ్చమైన పాలు కావాలంటే లీటర్ కు రూ.80 నుండి రూ.100 రూపాయలు చెల్లించాలి. అయితే ఈ పాలను పాడి రైతుల నుండి కేవలం 50‌ నుండి 60 రూపాయలకే డెయిరీ  సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈ పాలనే ప్రాసెసింగ్ చేసాక మంచి లాభం చూసుకుని అమ్ముతుంటారు.  

అయితే పాడి రైతుల నుండి సేకరించిన పాలను ప్రాసెసింగ్ చేసి అనేక పదార్థాలను తయారుచేస్తుంటాయి డెయిరీ కంపనీలు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పాలు ఏమాత్రం వేస్ట్ కాకుండానే అందులోని పదార్థాలను వేరు చేస్తారు. ఇలా పాలలోంచి ఫుల్ ఫ్యాట్ (క్రీమ్) ను వేరుచేసి దాంతో నెయ్యిని తయారుచేస్తారు. ఫ్యాట్ తీయగా మిగిలిన పాలను లో ఫ్యాట్ మిల్క్ పేరిట మార్కెట్ లో అమ్మేస్తారు. ఇలా డెయిరీ కంపనీలకు ఉచితంగానే నెయ్యి వస్తుంది.  

కిలో నెయ్యి తయారు కావాలంటే 30 నుండి 40 లీటర్ల పాలు అవసరం అవుతాయి. మార్కెట్ లో ఎంత తక్కువ అనుకున్నా కిలో నెయ్యి ధర వెయ్యి రూపాయలపైనే వుంది. సగటున ఓ 30 లీటర్ల పాలతో కిలో నెయ్యి తయారుచేసారని అనుకుందాం... ఆ లో ఫ్యాట్ మిల్క్ ను రూ.70 కి లీటర్ చొప్పున అమ్మినా రూ.2100 వస్తుంది. అంటే రైతునుండి రూ.50 కి కొనుగోలు చేసి రూ.70 కి అమ్ముతున్నారంటే లీటర్ పై రూ.20 లాభం... 30 లీటర్లపై రూ.600 లాభం. దీనికి కిలో నెయ్యి అంటే రూ.1000 అదనం. మొత్తంగా డెయిరీ కంపనీలు 30 లీటర్ల పాలపై రూ.1600 వరకు లాభం పొందుతాయి. 

అందువల్లే తిరుమల వంటి ఆద్యాత్మిక సంస్థలకు నెయ్యిని అతి తక్కువ ధరకు సరఫరా చేయగలుగుతున్నాయి డెయిరీ సంస్థలు. ఇంత లాభం పెట్టుకుని కూడా మరిన్ని డబ్బులకు ఆశపడితేనే కల్తీకి పాల్పడేది. తిరుమలలో ఇదే జరిగిందనేది ప్రస్తుత ప్రభుత్వ వాదన. అతి తక్కువ ధరకే అంటే కిలో నెయ్యి రూ.319 కే అందిస్తామని టెండర్ దక్కించుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేసిందట ఏఆర్ ఫుడ్స్. ఈ విషయం భయటపడటంతో రచ్చరచ్చ అవుతోంది. 
 

Tirumala Laddu

సాధారణంగా అయితే నెయ్యి ఎందుకంత రేటు : 

భారీ డెయిరీ సంస్థలు అత్యాధునిక మిషన్లతో పాల నుండి ఫ్యాట్ ను వేరు చేస్తాయి. కానీ మామూలుగా అయితే ఇది అంత ఈజీ కాదు. 30-40 లీటర్ల పాలను సేకరించి వివిధ ప్రక్రియల ద్వారా నెయ్యిని తీస్తారు. ఇలా పాలన్నీ ఉపయోగిస్తేనే నెయ్యి తయారవుతుంది. కాబట్టి కిలో నెయ్యి తయారికీ వెయ్యి రూపాయలకు పైగానే ఖర్చు అవుతుంది. అందువల్లే బయట దొరికే నెయ్యి పెద్దపెద్ద డెయిరీ కంపనీల నెయ్యి ధరకంటే అధిక ధర కలిగివుంటుంది.  

తిరుపతి విషయమే తీసుకుంటే... స్వామివారి నైవేధ్యం కోసం ప్రతిరోజు 60 కిలోల స్వచ్చమైన నెయ్యిని వినియోగిస్తారని టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెయ్యి కిలో రూ.1667 ధర చెల్లించి టిటిడి కొనుగోలు చేస్తుందట. అంటే 60 కిలోల నెయ్యికోసం ప్రతిరోజు లక్ష రూపాయలకు పైగా టిటిడి ఖర్చు చేస్తోందట... ఇలా స్వచ్చమైన నెయ్యికోసం నెలకు రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది టిటిడి. 

ఇదే టిటిడి లడ్డు తయారీకోసం మాత్రం కేవలం రూ.300 నుండి రూ.500 కే కేజీ నెయ్యి కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కలు కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇక్కడ స్వామివారి నైవేధ్యం కోసం ఉపయోగించే నెయ్యిని   ఆగమశాస్త్రం ప్రకారం ప్రాచీన పద్దతిలో తయారుచేస్తారు కాబట్టి అంత ఎక్కువ ధర. లడ్డుల తయారీ కోసం ఉపయోగించే నెయ్యి డెయిరీ సంస్థల్లో మిషనరీ ద్వారా తయారుచేస్తారు కాబట్టి అంత తక్కువ ధర అని టిటిడి వివరిస్తోంది. 

click me!