తిరుమల శ్రీవారి దర్శనంలో జ‌గ‌న్ - టీటీడీ డిక్లరేషన్ తో బిగ్ ట్విస్ట్ - ఏం జ‌ర‌గ‌బోతోంది?

First Published Sep 26, 2024, 1:57 PM IST

Jagan- TTD Declaration:  తిరుప‌తి ల‌డ్డూ ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాల‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ల‌డ్డూ వివాదంలో అంద‌రికీ ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టార్గెట్ అయ్యాడు. ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ని జ‌గ‌న్ తిరుమ‌లేశుని ద‌ర్శ‌నం కోసం వెళ్తాన‌ని చెప్ప‌డంతో ఆ రోజు ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదే క్రమంలో జగన్ డిక్లరేషన్ తెరమీదకు వచ్చింది. 

Jagan- TTD Declaration:  పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో జంతువులు కోవ్వు, నూనెలు కలిపారనే వార్తలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఏపీలో రాజ‌కీయ దుమారం రేపుతోంది. అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఇప్పుడు ఇదే అంశం మాట‌ల యుద్ధానికి తెర‌తీసింది. ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గ‌త వైఎస్ఆర్సీపీ స‌ర్కారును టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది.

ముఖ్యంగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు ప‌దును పెంచింది. ఇప్పుడు వైకాపా కూడా అధికార పార్టీ నాయ‌కుల‌పై ఎదురుదాడికి దిగింది. ఈ క్ర‌మంలోనే ఈ శనివారం (సెప్టెంబర్‌ 28) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని త‌మ పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చింది వైకాపా. 
 

జ‌గ‌న్ తిరుమ‌ల ద‌ర్శ‌నం నేప‌థ్యంలో తెర‌మీద‌కు కొత్త అంశం

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల నెల 27న తిరుమలకు వెళ్లనున్నారు. త‌ర్వాతి రోజు అంటే శ‌నివారం (సెప్టెంబ‌ర్ 28న) తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడిని దర్శించుకోనున్నారు. ఇప్ప‌టికే ల‌డ్డూ వివాదంలో అంద‌రికీ టార్గెట్ గా మారిని జ‌గ‌న్.. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను ప్ర‌క‌టించ‌డం ఉత్కంఠ‌ను పెంచింది. జ‌గ‌న్ తిరుమ‌ల పర్యటన సంద‌ర్భంగా డిక్లరేషన్ అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌, ద‌ర్శ‌నం కోసం జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని ఎన్డీఏ నాయ‌కులు డిమాండ్ చేయ‌డంలో మ‌రోసారి రచ్చ మొద‌లైంది.

తిరుమ‌లేశుని ద‌ర్శ‌నానికి డిక్ల‌రేష‌న్ ఎందుకు? 

తిరుమల తిరుపతి దేశస్థానం గతంలో పేర్కొన్న సమాచారం ప్రకారం.. టీటీడీ సాధారణ నిబంధనలలోని రూల్ నంబర్ 136 కేవలం హిందువులకు మాత్రమే దర్శనానికి అనుమతించబడుతుందని పేర్కొంది. అయితే, వేంకటేశ్వరుని దర్శనం కోరుకునే హిందువులు కాని వారు అంటే ఇతర మతస్తులు తమ మతం గురించి టీటీడీ అధికారులకు తెలియజేయాలి. 

రూల్ 137 ప్రకారం విశ్వాస రూపంలో తమకు తిరుమలేశుని పై నమ్మకం ఉందని ప్రకటించాలి. 2014 సర్క్యులర్ ప్రకారం, ఎవరైనా హిందూయేతరులుగా గుర్తించబడితే వారి నుంచి డిక్లరేషన్ ను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అడగవచ్చు.

Latest Videos


ముదురుతున్న జగన్ డిక్లరేషన్ వివాదం.. ఏన్డీయే నేత‌ల డిమాండ్ 

తిరుపతి లడ్డూ వివాదం సమయంలో జగన్ డిక్లరేషన్ పైన చర్చ మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.  మ‌రోసారి అధికార కూట‌మి, వైకాపా నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధాన్ని మ‌రింత ముదిరేలా చేస్తోంది. ఏన్డీయే నాయ‌కులు జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్ అన్యమతస్థుడ‌నీ, హిందువు కాదు కాబ‌ట్టి ఆయ‌న వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం కోసం డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ నాయ‌కురాలు పురందేశ్వరి అన్నారు. అలాగే, ఇత‌ర ఎన్డీఏ నేతలు కూడా జ‌గ‌న్ నుంచి డిక్ల‌రేష‌న్ ను డిమాండ్ చేస్తున్నారు. 

జ‌గ‌న్ తిరుమ‌ల ద‌ర్శ‌నం డిక్ల‌రేష‌న్ పై చంద్ర‌బాబు ఏమ‌న్నారు? 

తిరుమల లడ్డూ వివాదం నేప‌థ్యంలో స్పందించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆలయంలోకి ప్రవేశించే ముందు పీఠాధిపతి అయిన వేంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చారా అని తెలుసుకోవాలని కోరారు.

ఇదే విష‌యాన్ని  చంద్ర‌బాబు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ నుంచి కూడా ప్ర‌స్తావించారు. జ‌గ‌న్ తిరుప‌తి ఆలయాన్ని సందర్శించి, దేవుడి దర్శనం చేసుకోవచ్చని చెప్పిన చంద్ర‌బాబు.. ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అన్నది ముఖ్యం. విశ్వాసం ఉంటే, హిందువులు కానివారు నిర్దేశించిన సంప్రదాయం ప్రకారం డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి. మీకు డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఆ సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమలకు ఎందుకు వెళ్లాలి? అని ప్ర‌శ్నించారు. 

ముఖ్యమంత్రిగా పనిచేయడానికి ప్రజలు తనకు అవ‌కాశం ఇచ్చార‌ని చెప్పిన చంద్ర‌బాబు.. తాము సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని అన్నారు. అలాగే, హనుమాన్ విగ్రహం లేదా రాముడి విగ్రహాన్ని అపవిత్రం చేయడం గురించి అడిగినప్పుడు ఎగతాళి చేశారు. ఆలయ రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా ఇదే స్పందన వచ్చింది. తమ నిర్లక్ష్యపు స్పందనలు, ప్రకటనలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిప‌డ్డారు.

tirupati laddu

తిరుప‌తి డిక్ల‌రేష‌న్ వివాదానికి తెర‌లేపిన అప్ప‌టి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

హిందూయేతరుల ఆలయ ప్రవేశానికి తిరుమల డిక్లరేషన్‌ అవసరం లేదని 2020లో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆయ‌న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అనేక రాజకీయ పార్టీలు, హిందూ సంస్థలు ఆందోళనకు దిగడంతో సుబ్బా రెడ్డి వాటిని ఉపసంహరించుకున్నారు. 

అలాగే, ఇదివ‌ర‌కు ప‌లుమార్లు జ‌గ‌న్ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. 2012 ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన‌ప్పుడు టీటీడీ అధికారులు ఆయ‌న నుంచి డిక్లరేషన్ కోరారు. అయితే, 2009లోనే డిక్లరేషన్ ఇచ్చిన‌ట్టుగా జ‌గ‌న్ పేర్కొన్నార‌ని అప్ప‌టి ఈవోగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నార‌ని ప‌లు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఏన్డీయే నేత‌లు జ‌గ‌న్ నుంచి కోరుతున్న డిక్ల‌రేష‌న్ డిమాండ్ ల‌తో పాటు అప్ప‌టి డిక్ల‌రేష‌న్ వార్త క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

cbn pawan jagan

ల‌డ్డూ వివాదంపై ఘాటుగా స్పందిస్తున్న వైకాపా నాయ‌కులు 

లడ్డూ తయారీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి వెంకటేశ్వరరావు (నాని)తోపాటు  వల్లభనేని వంశీ ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లడ్డూ తయారీలో లో కొవ్వు కలిపారని నిరాధారమైన ఆరోపణలు చేయడం కోట్లాది మంది భ‌క్తుల‌ను అవమానించడమేనని విమర్శించారు.

బాబు మతపరమైన అంశాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాబు ప్రకటనలను సమర్థించడాన్ని వారు ఖండించారు. టీడీపీ నాయకులు వెంకటేశ్వర స్వామిపై చేసిన పాపాలను పోగొట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సెప్టెంబర్ 28న ప్రతి నియోజకవర్గంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారని ప్రకటించారు.
 

click me!