తిరుమల లడ్డు వివాదంపై కేఏ పాల్ ఏమన్నారంటే :
తిరుమల పవిత్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేఏ పాల్ సూచించారు. తిరుమలను కలుపుకుని తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. ఇలా తిరుమలతో పాటు తిరుపతిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ...అప్పుడే ఈ ప్రాంతంతో రాజకీయాలు చేయడం ఆపగలమని అన్నారు.
కేవలం 741 మంది మాత్రమే వున్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా ప్రకటించారు... అలాంటిది 34 లక్షల మంది హిందువులను కలిగిన తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్య ఏమిటని అన్నారు. వెంటనే తిరుపతిని యూటీగా ప్రకటించాలి...లేదంటే ప్రత్యేక దేశాన్నే డిమాండ్ చేస్తామంటూ కేఏ పాల్ బాండ్ పేల్చారు.
ఇక తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వినియోగంపై రాజకీయాలు చేయడం ఆపాలని... ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం వుందన్నారు. కాబట్టి ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని పాల్ డిమాండ్ చేసారు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ విచారనే కొనసాగితే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశాలుండవు అనేలా కేఏ పాల్ మాట్లాడారు.