రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీ కొని మూడు ఏనుగులు మృతి..

Published : Jun 15, 2023, 08:38 AM IST

రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీ కొట్టడంతో మూడు ఏనుగులు మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో వెలుగు చూసింది. 

PREV
16
రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీ కొని మూడు ఏనుగులు మృతి..

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురై మూడు ఏనుగులు మృతి చెందిన హృదయ విదారక ఘటన  చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. బుధవారం రాత్రి ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపును లోడ్ తో వెళుతున్న మినీ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయి. వీటిలోఒకటి పెద్దదైన మగ ఏనుగు. కాగా, రెండు చిన్న ఏనుగులు. అందులో ఒకటి ఆడా, ఒకటి మగ.

26

చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని జాతీయ రహదారికి ఇరువైపులా అడవులు ఉంటాయి. దీంతో రోడ్డు ఇరువైపులా ఉన్న అడవులలో నుంచి అటు ఇటు ఆహారం కోసం ఏనుగులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఒక్కోసారి పగటిపూట కూడా ఏనుగుల గుంపు రోడ్డు మీద నిలబడి ఉన్న సందర్భాలు అక్కడివారికి అనుభవమే.  బండిమీదో, కారులోనో వెడుతుంటే సడన్ గా ఒకసారిగా రోడ్డుమీద ఏనుగులు గుంపు ప్రత్యక్షమవడం కనిపిస్తుంది.
 

36

ఆ సమయాల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండి దూరంగా తమ వాహనాలను ఆపేసి.. ఏనుగులు రోడ్డు దాటిన తర్వాత తిరిగి ప్రయాణాన్ని చేస్తుంటారు. అయితే, బుధవారం తాజాగా జరిగిన ప్రమాదంలో.. రాత్రిపూట భూతలబండ వద్ద ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి. ఆ సమయంలో చెన్నైకి కూరగాయల లోడుతో  వెళుతున్న మినీ లారీ ఈ ఏనుగుల గుంపును ఢీ కొట్టింది. దీంతో మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి.

46

ఏనుగును ఢీకొట్టడంతో వ్యాన్ ముందు భాగం కూడా నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదం కారణంగా పలమనేరు జాతీయ రహదారికి రెండువైపులా వెహికల్స్ భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన పలమనేరు రేంజర్ శివన్న సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేయించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసినట్లుగా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. 

56

దీని మీద పరిశీలన చేయడానికి చిత్తూరు డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఏనుగులను ఎక్స్క్యూబేటర్ సహాయంతో.. సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించారు. గురువారం నాడు అక్కడే చనిపోయిన ఏనుగులకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. 

66

ప్రమాదానికి కారణంగా మినీ లారీ అతివేగంగా రావడం.. చీకట్లో ఏనుగులు రోడ్డు దాటుతున్న విషయాన్ని డ్రైవర్ గుర్తించకపోవడంతోనే జరిగిందని భావిస్తున్నారు.  ఇక్కడ ఇలాంటి ప్రమాదంలో ఏనుగులు చనిపోవడం ఇదే మొదటిసారి అని.. ఇప్పటివరకు విద్యుత్ తీగలు తగిలో లేదా అనారోగ్య కారణాలతో మాత్రమే ఏనుగులు మృతి చెందాయని చెబుతున్నారు. 

click me!

Recommended Stories