బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

First Published | Jan 2, 2020, 5:15 PM IST

బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది.

రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 3వ తేదీన నివేదిక ఇవ్వనుంది.ఇప్పటికే ఈ నివేదికపై హైపవర్ కమిటీ చర్చించనుంది.
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలను అసెంబ్లీ వేదికగా గత ఏడాది చివర్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. దీంతో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని రైతులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి.

ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన నివేదికను ఇవ్వనుంది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో మంత్రులతో పాటు అధికారులు కూడ సభ్యులుగా ఉన్నారు.
బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ రిపోర్టుతో పాటు, జీఎన్ రావు కమిటీ నివేదికపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ నెల 8వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో బోస్టన్ కమిటీ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది.
రాజధాని అంశంపై రెండు కమిటీలతో పాటు హైపవర్ కమిటీతో ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది చివర్లో కేబినెట్ సమావేశంలోనే రాజధాని అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగింది. కానీ, ఆ సమావేశంలో మాత్రం రాజధానిపై మాత్రం తొందరపాటు లేదనే అభిప్రాయాన్ని జగన్ మంత్రులకు చెప్పినట్టుగా ప్రచారం సాగింది.
ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రిపబ్లిక్ వేడుకల తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయమై అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల తర్వాత అఖిలపక్ష సమావేశం కూడ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయమై రాజధాని విషయమై మూడు కమిటీల నివేదికలను ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంది.అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఏ రకమైన అభిప్రాయాన్ని చెబుతాయో కూడ ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది.
అయితే అమరావతిలో ఇప్పటికే తీసుకొన్న భూముల విషయమై ప్రత్యేక అసెంబ్లీ జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడ ప్రభుత్వం వద్ద ఉంది. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహంతో ఉన్నారు.
అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర నివేదికలో బ్రౌన్ ఫీల్డ్ రాజధానికి సిఫారసు చేసింది.

Latest Videos

click me!