ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ఫార్మూలాతోనే ఆ పార్టీకి చెక్ పెట్టాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. బీజేపీకి ఆయువుపట్టులాంటి హిందూత్వ ఎజెండాను టీడీపీ తన భుజానికి ఎత్తుకొంది. బీజేపీని రాజకీయంగా దెబ్బతీసేందుకుగాను టీడీపీ ఈ ఎజెండాను ఎత్తుకొందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ. అయితే రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ తన విధానాలను మార్చుకొన్నట్టుగా కన్పిస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

తెలుదేశం పార్టీ లౌకిక భావజాలం నుండి హిందూత్వంపై కొనసాగుతుందా అనే చర్చ ప్రారంభమైంది. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలను చూస్తే ఈ విషయమై తీవ్ర చర్చ సాగుతోంది.

38 ఏళ్లుగా తెలుగు అనుకూల విధానాలను అవలంభించింది. సెక్యులర్ విధానాలను టీడీపీ అవలంభించింది. ఇటీవల కాలంలో హిందూమత రక్షణ కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్టుగా ఆ పార్టీ ఇటీవల చేసిన ప్రకటనలను బట్టి అర్ధమౌతోంది.

హిందూమతానికి చెందిన మందిరాలపై ఇటీవల కాలంలో దాడులు చోటు చేసుకొన్నాయి. ఈ దాడులను టీడీపీ తీవ్రంగా ఖండించింది.అంతేకాదు నిరసన కార్యక్రమాలకు కూడ పూనుకొంది.అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనను నిరసిస్తూ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిచ్చింది.

హిందూత్వ భావజాలం ద్వారా రాష్ట్రంలో బీజేపీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు గాను టీడీపీ ఈ కార్యక్రమాన్ని తీసుకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటన చోటు చేసుకొన్న విషయం తెలుసుకొన్న వెంటనే టీడీపీ నాయకత్వం పార్టీ నేతలను అక్కడికి పంపింది. నిజ నిర్ధారణ చేయాలని పార్టీ నేతలను ఆదేశించింది. అంతేకాదు ఈ విషయమై సీబీఐ విచారణకు కూడ టీడీపీ తొలుత డిమాండ్ చేసింది. ఆ తర్వాత అన్ని పార్టీలు కూడ సీబీఐ విచారణను కోరాయి.

నిరసన కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.రాష్ట్రంలో టీడీపీతో పొత్తు కారణంగా బీజేపీ బలపడేందుకు అవకాశం లేకుండా పోయిందని కమలదళం నేతలు గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీడీపీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తామని కమలదళం ధీమాగా ఉంది.

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు బీజేపీని దెబ్బకొట్టేందుకు అంతర్వేది ఘటనను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నెల 13 వ తేదీ నుండి ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో వారం రోజుల పాటు పూజలు నిర్వహించాలని టీడీపీ పిలుపునిచ్చింది.

ఏపీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మనోభావాలు దెబ్బతినే 100 ఘటనలు చోటు చేసుకొన్నాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైసీపీ ఒక్క మతానికి అనుకూలంగా వ్యవహారిస్తోందనే విషయాన్ని విపక్షాలు తెరమీదికి తెస్తున్నాయి.

ఆదివారం నాడు టీడీపీ కార్యకర్తలు సూర్యదేవాలయాల్లో, సోమవారం నాడు శివాలయాల్లో, మంగళవారం నాడు ఆంజనేయస్వామి దేవాలయంలో, బుధవారం నాడు అయ్యప్ప టెంపుల్ లో, గురువారం నాడు సాయిబాబా దేవాయలంలో శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయాల్లో, శనివారం నాడు విష్ణు ఆలయాల్లో పూజలు నిర్వహించనున్నారు. కొందరు నేతలు దేవాలయాల్లో పూజలు చేస్తే.. మరికొందరు దేవాలయాల సమీపంలోనే నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దాడులు ఎందుకు పెరిగిపోయాయో వివరించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టడంతో పాటు బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి ఈ వ్యూహాంతో టీడీపీ ముందుకు వెళ్తోందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.