బర్డ్ ప్లూ లక్షణాలు :
పౌల్ట్రీ ఫారాల్లో ఒకేసారి వందలాదిగా కోళ్లు చనిపోతే అందుకు బర్డ్ ప్లూ కారణం కావచ్చు. ఇది పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుంది. ఇది మనుషుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారికి ఇది సోకే అవకాశం ఎక్కువగా వుంటుంది.
బర్డ్ ప్లూ సోకిన 2 నుండి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఇది సోకినవారు జలుబు, ముక్కుకారడం, శ్వాస తీసుకోడంలో ఇబ్బంది వుంటుంది.ముక్కు మూసుకుపోవడం,గొంతునొప్పి, దగ్గు లక్షణాలు కనిపిస్తాయి.
కొందరిలో బర్డ్ ప్లూ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తీవ్రమైన తలనొప్పి, హైఫీవర్, తీవ్ర అలసట, కాళ్లు చేతుల కండరాల నొప్పులు, వికారం, వాంతులు విరేచనాలతో ఇబ్బందిపడతారు. ఒక్కోసారి ఇది అవయవ వైకల్యానికి ,న్యుమోనియాకు దారితీస్తుంది... ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసాయం పొందాలి. అయితే వైరస్ సోకినతర్వాత వైద్యం తీసుకోవడంకంటే సోకకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచింది. కాబట్టి కొద్దిరోజులు చికెన్ కొద్దిరోజులు చికెన్ కు దూరంగా వుండటం మంచిది.