రాజమండ్రి వెళుతున్న లోకేష్ కు మహిళల మంగళహారతులు... ప్లకార్డులతో సందడి (ఫోటోలు)
First Published | Oct 6, 2023, 1:00 PM ISTఅమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న తన తండ్రి చంద్రబాబును కలిసేందుకు నారా లోకేష్ బయలుదేరారు. గురువారం రాత్రి డిల్లీ నుండి ఉండవల్లి నివాసానికి చేరుకున్న లోకేష్ శుక్రవారం ఉదయం రోడ్డుమార్గంలో రాజమండ్రికి బయలుదేరారు. దీంతో ఆయనను కలిసేందుకు టిడిపి శ్రేణులు ప్లకార్డులు, జెండాలు, మహిళలు మంగళహారతులు పట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. లోకేష్ రాగానే ఇకపై అన్ని శుభాలే కలగాలని... చంద్రబాబు జైలునుండి బయటకు రావాలని కోరుకుంటూ మహిళలు మంగళహారతి ఇచ్చారు. అలాగే టిడిపి శ్రేణులు చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ లోకేష్ తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. అందరినీ పలకరిస్తూ లోకేష్ ముందుకు కదిలారు.