రాజమండ్రి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి నేడు సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్షలు చేపట్టింది. నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు, దేశ రాజధాని న్యూడిల్లీలో నారా లోకేష్ నిరాహార దీక్ష చేపట్టారు. నారా భువనేశ్వరి కూడా తన భర్త జైల్లో వున్న రాజమండ్రిలోనే నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. ఆమెకు టిడిపి, జనసేన మహిళా నాయకులతో పాటు భారీగా ప్రజలు సంఘీభావం తెలిపారు.