టిడిపి, జనసేన కూటమిదే అధికారం... బిజెపితో నష్టమే, వాళ్ళతో వెళితేనే మంచిది.. : శ్రీ ఆత్మసాక్షి సర్వే

Published : Oct 03, 2023, 10:18 AM ISTUpdated : Oct 03, 2023, 10:25 AM IST

చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు టిడిపి, జనసేన కూటమి గెలుపుకు అనుకూలంగా వున్నట్లు శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. 

PREV
16
 టిడిపి, జనసేన కూటమిదే అధికారం... బిజెపితో నష్టమే, వాళ్ళతో వెళితేనే మంచిది.. : శ్రీ ఆత్మసాక్షి సర్వే
AP Politics

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి,  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతను ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకునే ఎత్తుగడలో భాగంగానే వైసిపి ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయించిందని టిడిపి నాయకులు అంటున్నారు. అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేసారని వైసిపి నాయకులు అంటున్నారు. ఇలా చంద్రబాబు అరెస్ట్ పై అధికార, ప్రతిపక్షాల వాదన ఎలా వున్నా ప్రజలు ఏమనుకుంటున్నారన్నదే ముఖ్యం. ఇటీవల ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజలను టిడిపి మరింత దగ్గర చేసాయని తమ సర్వేలో తేలినట్లు శ్రీ ఆత్మసాక్షి వెల్లడించింది. వైసిపిపై ప్రజా వ్యతిరేకత పెరిగి పరిస్థితులన్నీ టిడిపి అనుకూలంగా మారుతున్నట్లు సర్వే రిపోర్ట్ ను ప్రకటించింది శ్రీ ఆత్మసాక్షి. 

26
TDP Janasena

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. చంద్రబాబు అరెస్ట్ టిడిపికే ప్లస్ అయ్యిందని... జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మరింత పెరిగిందన్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ టిడిపితో జతకట్టడంతో రాజకీయ సమీకరణలు మారిపోయినట్లు తెలిపారు. అయితే బిజెపిని చేర్చుకోవడం ద్వారా టిడిపి, జనసేన కూటమి నష్టపోతుందని... అలా కాకుండా లెప్ట్ పార్టీలతో జతకడితే మంచి ఫలితం వుంటుందన్నారు. ఇలా టిడిపి, జనసేన, లెప్ట్ పార్టీలు కలిసి వెళితే 120 కి పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు వున్నట్లు శ్రీ ఆత్మసాక్షి సర్వే వివరాలను వెల్లడించింది. 

36
AP Politics

2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తమ సర్వే నిజమయ్యిందంటూ ఆ వివరాలను శ్రీ ఆత్మసాక్షి వెల్లడించింది. వైసిపికి 139-142 అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పామని... అలాగే 151 సీట్లతో ఆ పార్టీ గెలుపొందిందని తెలిపారు. టిడిపికి 22-28, జనసేనకు 0-2 సీట్లు వస్తాయని అంచనా వేసామని... అలాగే టిడిపి 21, జనసేనకు 1 సీటు వచ్చాయన్నారు. పార్లమెంట్ విషయంలో అయితే తమ సర్వే 100 శాతంనిజమయ్యిందని... వైసిపికి 22 సీట్లు వస్తాయంటే 22, టిడిపికి 3 సీట్లు వస్తాయని చెబితే 3 వచ్చాయన్నారు. 

46
AP Politics

ఇక 2024 ఎన్నికలకు సంబంధించి వివిధ దశల్లో సర్వే చేపట్టినట్లు శ్రీఆత్మసాక్షి వెల్లడించింది. మొదటి దశ సర్వేలో 1,37,000 సాంపిల్స్ సేకరించామని... ఇందులో టిడిపికి 77, వైసిపికి 56, జనసేనకు 4 సీట్లు వస్తాయని తేలిందన్నారు. 38 చోట్లు హోరాహోరీ పోరు వుంటుందని అంచనా వేసామన్నారు. రెండో దశ సర్వేలో వైసిపి 63, టిడిపి 78, జనసేన 7 చోట్ల విజయం సాధించనున్నట్లు... 27 చోట్లు హోరాహోరీ వుండనున్నట్లు శ్రీ ఆత్మసాక్షి తేల్చింది. 

56
AP Politics

ఇక ఇటీవల చేపట్టిన మూడో దశ సర్వేలో ప్రజలు మెల్లిగా వైసిపి దూరం అవుతున్నట్లు తేలిందని శ్రీ ఆత్మసాక్షి ప్రకటించింది. ఒకవేళ పార్టీలన్నీ వేరువేరుగా పోటీచేస్తే టిడిపి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చింది.  టిడిపికి 44 శాతం, వైసిపిరి 41 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది. ఇక టిడిపి, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళితే ఈ కూటమికి 50 శాతం ఓట్లు, వైసిపికి 43 శాతం ఓట్లు వస్తాయట.

66
AP Politics

ఇదే టిడిపి, జనసేన కూటమి బిజెపితో కలిసివెళితే మాత్రం ఓట్ షేర్ తగ్గి కేవలం 43శాతానికే పరిమితమై వైసిపికి లాభం కానుందని తేల్చింది. అదే ఈ  కూటమి లెప్ట్ పార్టీలతో కలిసివెళితే ఓట్ షేర్ మరింత పెరగనుందని(54శాతం)...  వైసిపి కేవలం 43 శాతం ఓటింగ్ కు పరిమితం కానుందని తేల్చింది.

click me!

Recommended Stories