ఒంగోలు: తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్దమయ్యింది. ప్రకాశం జిల్లా మండువవారిపాలెంలో ఈనెల 27, 28 తేదీల్లో (ఇవాళ, రేపు) మహానాడును ఘనంగా నిర్వహించేందుకు టిడిపి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇక ఇప్పటికే మహానాడులో పాల్గొనేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర ముఖ్య నాయకులు ప్రకాశం జిల్లా బాటపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అధ్యక్షతన ఒంగోలులో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశమయ్యింది. మహానాడులో ప్రవేశపెట్టే 17 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడు నిర్వహణ పై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించారు.