ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ధైర్యం చెప్పేందుకు టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ను చంద్రబాబునాయుడు గతంలో పంపారు
undefined
కోడెల శివప్రసాదరావుకు కరణం బలరాం ధైర్యం చెప్పారు. చివరకు కోడెల మనోధ్యైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకొన్నట్టుగా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
undefined
ఈ నెల 16వ తేదీన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైద్రాబాద్‌లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యకు ముందు కోడెల శివప్రసాద్ రావుతో పాటు ఆయన కొడుకు శివరాం, కూతురు విజయలక్ష్మిపై పలు కేసులు నమోదయ్యాయి.
undefined
ఈ కేసులపై కోడెల శివప్రసాదరావు మనోవేదనకు గురైనట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై కోడెల శివప్రసాద్ రావు గతంలో చంద్రబాబునాయుడుతో చర్చించిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకొంటున్నారు.
undefined
వరుసగా తనపై కేసులు నమోదు కావడంపై కోడెల శివప్రసాద్ రావు కొంత మనోస్థైర్యాన్ని కోల్పోయినట్టుగా సమాచారం. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను ఇటీవలనే కోడెల శివప్రసాదరావు ఇంటికి పంపారు.
undefined
కేసుల విషయమై కోడెల శివ ప్రసాద్ రావుతో కరణం బలరాం చర్చించారు. కరణం బలరాం కోడెల శివప్రసాద్ రావుకు ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని బలరాం మీడియాకు చెప్పారు.
undefined
నెల రోజుల క్రితం కోడెల శివప్రసాద్ రావును తాను కలిసినట్టుగా మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేసుకొన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించిన విషయాన్ని ఆయన మీడియాకు చెప్పారు.
undefined
ఉద్దేశ్యపూర్వకంగానే తనపై కేసులు బనాయించిన విషయాన్ని కోడెల శివప్రసాద్ రావు తనతో చెప్పారని బుచ్చయ్య చెప్పారు. కేసుల విషయమై ప్రస్తావిస్తూ తన వద్ద కన్నీరు పెట్టుకొన్నారని బుచ్చయ్య చౌదరి భావోద్వేగానికి గురయ్యారు.
undefined
కేసులతో ఇబ్బంది పెడితే పల్నాడు ప్రాంతంలో టీడీపీని దెబ్బతీయవచ్చని వైఎస్ఆర్‌సీపీ ప్లాన్ గా భావించి ఈ రకంగా వేధింపులకు గురి చేసిందని తాను కోడెల శివప్రసాద్ రావుకు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
undefined