నేను పారిపోయానా? మీకు దొరకడం లేదా?: లోకేష్ ప్రశ్నలకు సిఐడి బృందం జవాబిదే...

Published : Oct 01, 2023, 11:59 AM ISTUpdated : Oct 01, 2023, 12:11 PM IST

తనకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన ఏపీ సీఐడి అధికారులతో జరిగిన సంబాషణను నారా లోకేష్ బయటపెట్టారు. తాను తప్పించుకుని తిరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై సిఐడి అధికారులను నిలదీసినట్లు లోకేష్ తెెలిపారు. 

PREV
15
నేను పారిపోయానా? మీకు దొరకడం లేదా?: లోకేష్ ప్రశ్నలకు సిఐడి బృందం జవాబిదే...
Nara Lokesh

న్యూడిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సిఐడి నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు పెద్ద కుంభకోణమని... ఇందులో ఆనాటి మంత్రి లోకేష్ పాత్ర వుందని సిఐడి ఆరోపిస్తోందట. ఈ మేరకు ప్రస్తుతం డిల్లీలో వున్న లోకేష్ కు సిఐడి అధికారులు బృందం నోటీసులు అందించింది. ఈ సమయంలో సిఐడి అధికారులతో జరిగిన సంభాషణ బయటపెడుతూ తనకు అందించిన నోటీసులపై లోకేష్ స్పందించారు. 

25
lokesh

'మీరు డిల్లీకి వచ్చినా నేను కనబడటం లేదంట కదా... అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అంటున్నానటగా... అలా ఎందుకు మాట్లాడుతున్నారు' అని నోటీసులు ఇవ్వడానికి వచ్చిన సిఐడి అధికారులను ప్రశ్నించినట్లు లోకేష్ తెలిపారు. అందుకు వాళ్లు తాము ఇవాళ(శనివారం) ఉదయమే వచ్చామని... నేరుగా ఇక్కడికి వచ్చి నోటీసులు ఇస్తున్నామని చెప్పారని లోకేష్ తెలిపారు. ఇంతకు ముందు తాము డిల్లీకే రాలేదని... అలాంటిది మీరు కలవడం లేదని ఎలా చెబుతామని సిఐడి అధికారులు అన్నారన్నారు. 

35
AP CID

అయితే ఇలాంటి ప్రచారం మరి ఎవరు చేస్తున్నారు... మీరు కానప్పుడు ఖండిచాల్సిన బాధ్యత మీపై వుంటుందని సీఐడి అధికారులకు చెప్పానని లోకేష్ అన్నారు. ఈ తప్పుడు ప్రచారంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని... ఏపీ సిఐడి, డిజిపి పైనా న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు. తాను సిఐడి అధికారులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నానంటూ ప్రచారం చేయడం దారుణమని... దీనిపై నిరసన తెలుపుతున్నానని అధికారుల బ‌ృందంతో చెప్పానని లోకేష్ వెల్లడించారు. 

45
Nara Lokesh

ఇక సీఐడి అధికారులు ఇచ్చిన నోటీసులను అందుకుని పూర్తిగా చదివానని... అనుమానాలుంటే వారిని అడిగానని లోకేష్ అన్నారు. సిఐడి లవ్ లెటర్ పై సంతకం చేసి తిరిగి ఇచ్చానని... ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని చెప్పానని అన్నారు. వైసిపి నాయకులలా తప్పుచేసి విచారణ నుండి తప్పించుకునే అలవాటు తమకు లేదని... అందువల్లే ధైర్యంగా అక్టోబర్ 4న సిఐడి విచారణకు హాజరవుతానని లోకేష్ స్పష్టం చేసారు. 
 

55
lokesh

ముఖ్యమంత్రి జగన్ తో ఆయన కేసుల్లో నిందితులు ఇప్పటివరకు విచారణకు హాజరుకాకుండా రెండు వేల సార్లు వాయిదా కోరారని లోకేష్ అన్నారు. ఇక ఏ1 జగన్, ఏ2 విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే న్యాయస్థానాల అనుమతి తీసుకోవాలని... తమకు ఆ దుస్థితి పట్టలేదన్నారు. తాను విదేశాలకు పారిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఏ తప్పూ చేయని తాను ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదని లోకేష్ అన్నారు. తల్లిని హాస్పిటల్లో చేర్చి అరెస్ట్ ల నుండి తప్పించుకున్న వైసిపి నాయకులలా నాటకాలాడటం రాదన్నారు. తనపై పెట్టింది దొంగకేసు... కాబట్టి భయపడకుండా నూటికి నూరు శాతం విచారణకు హాజరవుతానని నారా లోకేష్ వెల్లడించారు.  

 

Read more Photos on
click me!

Recommended Stories