జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో ఆ కూటమిలో బీజేపీ చేరేనా?

First Published | Oct 26, 2023, 11:08 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి.

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ఎత్తుగడలతో  ఆ మూడు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  బీజేపీతో పొత్తున్నప్పటికీ  వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించి సంచలనానికి తెర తీశారు.  తెలంగాణ రాష్ట్రంలో మాత్రం  బీజేపీ, జనసేన మధ్య పొత్తు పొడిచింది. మరో వైపు తెలంగాణలో  ఒంటరిగా పోటీ చేస్తామని టీడీపీ ఇదివరకే ప్రకటించింది.

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

2014 ఎన్నికల సమయంలో  టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  పోటీ చేశాయి.ఈ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది. ఈ కూటమి అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ప్రచారం నిర్వహించారు

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

2014లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ అధికారంలోకి వచ్చింది.  చంద్రబాబు సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను పవన్ కళ్యాణ్ విబేధించారు.  సీపీఐ,సీపీఎం, బీఎస్పీలతో జత కట్టారు.  2019 ఎన్నికల్లో  ఈ మూడు పార్టీలతో కలిసి జనసేన పోటీ చేసింది.  జనసేన ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఈ ఎన్నికల తర్వాత  బీజేపీ, జనసేన మధ్య  మైత్రి ఏర్పడింది.  2024 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని  పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రకటించారు.

also read: జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో కమలం, తెలంగాణలో టీడీపీ దూరం

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

అయితే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కారణంగా  జనసేన వ్యూహలను మార్చుకుంది.  వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో  విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని  పవన్ కళ్యాణ్ విపక్షాలను కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా  పోటీ చేయడం, లేదా టీడీపీ,జనసేన కలిసి పోటీ చేయడం లేదా  జనసేన , బీజేపీ కలిసి పోటీ చేయాలనే  విషయమై చర్చలు జరిగాయి.

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

జనసేన ఒంటరిగా  పోటీ చేస్తే రాజకీయంగా  తమకు ప్రయోజనం కంటే  నష్టమనే అభిప్రాయంతో  జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదే జరిగితే  వైసీపీకి పరోక్షంగా  లాభం  కల్గించేందుకు దోహదపడినట్టు అవుతుందని జనసేన భావించింది.  టీడీపీతో కలిసి  పోటీ చేయాలని  జనసేన భావించింది. తాము ఎన్‌డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో  టీడీపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని  ఈ నెల  23న  పవన్ కళ్యాణ్  కుండబద్దలు కొట్టారు. 

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

ఇదిలా ఉంటే  2019 ఎన్నికలకు ముందు  ఎన్‌డీఏతో  టీడీపీ తెగదెంపులు చేసుకుంది.  కానీ, 2019 ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో  బీజేపీకి దగ్గర కావాలని టీడీపీ ప్రయత్నాలు చేసింది. ఎన్‌డీఏలో టీడీపీ చేరేందుకు సానుకూలంగా ఉందనే సంకేతాలు కూడ ఇచ్చింది. కానీ ఎన్‌డీఏలో  టీడీపీకి మాత్రం  ఆహ్వానం అందలేదు.

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

ఇదిలా ఉంటే  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబును  ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్  9న అరెస్ట్ చేశారు. చంద్రబాబును రాజమండ్రి జైల్లో పరామర్శించిన తర్వాత వచ్చే ఎన్నికల్లో  టీడీపీతో కలిసి పోటీ చేస్తామని  పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఈ విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వంతో కూడ చర్చించనున్నట్టుగా  పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

also read:జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో కమలం, తెలంగాణలో టీడీపీ దూరం

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న  జనసేన టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంపై  ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.ఈ విషయం బీజేపీ వర్గాలకు విస్మయం కలిగించింది.  టీడీపీతో కలిసి పనిచేసేందుకు బీజేపీకి  చెందిన నాయకత్వం  సానుకూలంగా లేదనే ప్రచారం కూడ సాగుతుంది.  అయితే  బీజేపీలోని కొందరు నేతలు టీడీపీతో కలిసి వెళ్లేందుకు సానుకూలంగా  ఉన్నారు. కానీ మరికొందరు  మాత్రం వ్యతిరేకంగా  ఉన్నారు. ఏపీలో టీడీపీతో కలిసి పనిచేసేందుకు బీజేపీ సానుకూలంగా లేనందునే  ఎన్‌డీఏలో  ఆ పార్టీకి ఆహ్వానం పలకలేదనే  ప్రచారం కూడ లేకపోలేదు. 

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

బీజేపీతో పొత్తు కోసం టీడీపీ నాయకత్వం సానుకూలంగా ఉంది.  కానీ బీజేపీ నాయకత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,  కేంద్ర హోంశాఖ అమిత్ షాలతో   చంద్రబాబు గతంలో సమావేశమయ్యారు. పొత్తు విషయమై  చర్చించారని అప్పట్లో చర్చ జరిగింది.  ఆ తర్వాతే ఎన్‌డీఏ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందలేదు. కానీ జనసేనానికి ఆహ్వానం అందింది. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వన్ సైడ్ లవ్ చేస్తుందని అప్పట్లో వైసీపీ విమర్శలు చేసింది.

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

ఇదిలా ఉంటే  చంద్రబాబు  అరెస్ట్  తర్వాత  ఆంధ్రప్రదేశ్ లో  టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. కానీ,  ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. జనసేనతో కలిసి పనిచేసేందుకు బీజేపీ సానుకూలంగా ఉంది.  టీడీపీతో కలిసి పనిచేసేందుకు వెనుకంజ వేస్తుంది.  బీజేపీతో  పనిచేసేందుకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. టీడీపీ,బీజేపీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీకి  జనసేన రెడీగా ఉంది.

జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరేనా?

చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీపై   టీడీపీ నేతలు విమర్శలు చేశారు.  లోకేష్ అమిత్ షాతో భేటీ తర్వాత  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి  ఈ విమర్శలకు చెక్ పెట్టారు. 
 
also read:జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ ‌స్టోరీ:ఏపీలో కమలం, తెలంగాణలో టీడీపీ దూరం

Latest Videos

click me!