చంద్రబాబు కాన్వాయ్ నంద్యాల నుంచి విజయవాడ (ఫొటోలు)

Siva Kodati | Published : Sep 9, 2023 9:05 PM
Google News Follow Us

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి నంద్యాల నుంచి విజయవాడ తీసుకొచ్చారు. అయితే మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్‌ని టీడీపీ నేతలు, కార్యకర్తలు పలుమార్లు అడ్డుకున్నారు. పోలీసులు వీరిని చెదరగొట్టి కాన్వాయ్ వెళ్లేలా చర్యలు చేపట్టారు. 

110
చంద్రబాబు కాన్వాయ్ నంద్యాల నుంచి విజయవాడ (ఫొటోలు)
chandrababu

చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు ఆటంకం కలిగించారు. అయితే పోలీసులు భారీ భద్రతను కల్పించారు. 

210
chandrababu

చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌కి ఎదురెళ్తున్న ఓ టీడీపీ కార్యకర్త. అతనిని పక్కకు లాగుతున్న పోలీసులు, ప్రజలు. నిలిచిపోయిన కాన్వాయ్ 

310
chandrababu

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు

Related Articles

410
chandrababu

చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పలుచోట్ల టీడీపీ శ్రేణులు యత్నించాయి.  అయితే పోలీసులు వారిని  చెదరగొడుతూ ముందుకు సాగారు. 

510
chandrababu

తాడేపల్లిలోని సీఐడీ సిట్ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు. భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు, ఎన్ఎస్జీ బలగాల రక్షణ వలయంలో చంద్రబాబు. 

610
chandrababu

చంద్రబాబు కాన్వాయ్ ఒంగోలుకు చేరుకోగానే మహిళలు, వృద్ధులు సైతం రోడ్డు మీదికి వచ్చి పోలీసులను తోసుకుంటూ కాన్వాయ్‌కు అడ్డు పడ్డారు.

710
chandrababu

అద్దంకి నియోజకవర్గం ముప్పవరం లో టీడీపీ కార్యకర్తల నిరసన తెలియజేశారు. పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు నాయుడు‌ను తరలిస్తున్న కాన్వాయ్‌కు టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డారు. 

810
chandrababu

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ జాతీయ రహదారిపై టైర్లు దగ్ధం చేసిన టీడీపీ కార్యకర్తలు. హైవేను దిగ్భంధించడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. 

910
chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కారు వెంట పార్టీ జెండా పట్టుకుని పరుగులు తీస్తోన్న మహిళా కార్యకర్త. ఆమెను అడ్డుకుంటున్న పోలీసులు

1010
chandrababu

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. నంద్యాల నుంచి విజయవాడకు దాదాపు 9 గంటల శ్రమించి తీసుకొచ్చారు. 

Recommended Photos