కాలినడకన కూడా కార్యకర్తలను సభా ప్రాంగణం వైపు వెళ్లనివ్వడం లేదు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి వాహనాలను సైతం లోనికి అనుమతించడం లేదు. పోలీసులు ఇప్పటికే వేలాది మంది జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు, నలుగురు కలసి ఒక చోట ఉన్నా, నడిచి వెళ్తున్నా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపధ్యంతో రాజమండ్రి నగరాన్ని తీవ్ర ఆంక్షలతో అష్టదిగ్భందనం చేశారు