మంగళగిరి: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పిలుపునిచ్చినట్లు రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తుల కోసం చేపట్టాల్సిన ఆందోళనలతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనా పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించేందుకు విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పవన్ ప్రతిఒక్కరి మాటలను శ్రద్దగా వింటూ... సలహాలు, సూచనలను నోట్ చేసుకున్నారు పవన్.