Janasena Party: అభిమానుల సందడి... పూల వర్షం, గజమాలతో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం
First Published | Sep 29, 2021, 2:53 PM ISTఅమరావతి: ఇవాళ(బుధవారం) జనసేన పార్టీ ఏర్పాటుచేసిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. గన్నవరం ఎయిర్ పోర్ట్ బయట పవన్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. . గన్నవరం నుండి కారులో జనసైనికులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి జనసేన కార్యాలయానికి చేరుకొన్నారు. నిడమానూరు వద్ద పవన్ పై పూలు జల్లుతూ, గజమాలతో సత్కరిస్తూ అభిమానులు కోలాహలం చేశారు.