చేతగాకపోతే రాజీనామా చెయ్... నేను చూసుకుంటా..: జగన్ కు చంద్రబాబు సవాల్

Published : Nov 24, 2022, 04:42 PM ISTUpdated : Nov 24, 2022, 04:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 'ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ' పేరిట సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొని ఆక్వా రంగ సంక్షోభంలో వుందంటూ చంద్రబాబు ప్రసంగించారు. 

PREV
17
చేతగాకపోతే రాజీనామా చెయ్... నేను చూసుకుంటా..: జగన్ కు చంద్రబాబు సవాల్
seminar on aquaculture crisis in AP

మంగళగిరి : వైసిపి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని రంగాల మాదిరిగానే ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడిందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేసారు. ఆక్వా రంగాన్ని కాపాడుకునేందుకు రైతులు పోరాడుతున్నారని... వారికి తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

27
seminar on aquaculture crisis in AP

గత టిడిపి హయాంలో ఆక్వా రంగం 70శాతం వృద్దితో దూసుకుపోయిందని... అదే విధానాలను వైసిపి ప్రభుత్వం కూడా కొనసాగించివుంటే ఇప్పుడీ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఆక్వా సాగులో నష్టాలువచ్చి రైతులు బాధపడుతుంటే జగన్ మాత్రం సైకోలాగ ఆనందపడుతున్నాడని చంద్రబాబు అన్నారు. 

37
seminar on aquaculture crisis in AP

ఏపీలో ఆక్వారంగ పరిస్థితులపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో 'ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ' పేరుతో నిర్వహించిన సదస్సుకు టిడిపి అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు టిడిపి ప్రభుత్వం ఎలా సహాయం అందించిందో... వైసిపి ప్రభుత్వం ఎలా దోచుకుంటోందో చంద్రబాబు వివరించారు. 

47
seminar on aquaculture crisis in AP

ఈ సదస్సులో ఆక్వా రైతులు, ఆక్వారంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టిడిపి కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 

57
seminar on aquaculture crisis in AP

వైసిపి ప్రభుత్వ చేతగాని పాలనకు ఆక్వా రంగం, రైతులు బలయిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగితే సమస్యలు పరిష్కారం కావని... సరయిన నిర్ణయాలతోనే సమస్యలను దూరం చేసుకోవచ్చని ఇప్పటికైనా జగన్ గుర్తిస్తే మంచిదని చంద్రబాబు అన్నారు. 

67
seminar on aquaculture crisis in AP

వైసిపి అధికారంలోకి వచ్చాక ఒక్క ఆక్వారంగమే కాదు ప్రతి రంగంమూ సంక్షోభంలో నెట్టివేయబడిందని చంద్రబాబు అన్నారు. ఏ సమస్యనూ వైసిపి పాలకులు పరిష్కరించలేకపోతున్నారని అన్నారు. 'మీకు చేతకాకుంటే రాజీనామా చేసిపొండి.... నేను ఎలా పరిష్కరిస్తానో చూడండి' అంటూ చాలెంజ్ విసిరారు. 

77
seminar on aquaculture crisis in AP

ప్రభుత్వ పెద్దల అవినీతే ఆక్వా రంగాన్ని నిండా ముంచుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. టన్ను ఆక్వా ఫీడ్ కు రూ.5 వేల చొప్పున ఉత్పత్తిధారుల నుండి వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందని అన్నారు. ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బులను ఎన్నికల్లో ఓట్లు కొనడానికి ఉపయోగించాలని వైసిపి చూస్తోందని చంద్రబాబు ఆరోపించారు,

click me!

Recommended Stories