కూతురు అన్షు సినీ ఎంట్రీపై మంత్రి రోజా క్లారిటీ.. ఆమె ఏం చెప్పారంటే..

Published : Nov 17, 2022, 11:46 AM IST

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా గురువారం తన పుట్టిన రోజు సందర్బంగా మంత్రి రోజా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా.. తన కూతురు, కుమారుడి సినీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

PREV
19
కూతురు అన్షు సినీ ఎంట్రీపై మంత్రి రోజా క్లారిటీ.. ఆమె ఏం చెప్పారంటే..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా.. తన కూతురు, కుమారుడి సినీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తన పుట్టిన రోజు సందర్బంగా మంత్రి రోజా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రోజాతో పాటు శ్రీవారి దర్శనం చేసుకున్నవారిలో ఆమె సన్నిహితులు, జబర్దస్త్ వర్ష, ప్రముఖ సింగర్ మంగ్లీ కూడా ఉన్నారు. 

29

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. కార్తీక్ మాసం సందర్భంగా తిరుమలకు రావడం, తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నిసార్లు వచ్చిన స్వామివారిని చూస్తూనే ఉండాలని అనిపిస్తుందని చెప్పారు. స్వామివారి దివ్యరూపం ఎన్నిసార్లు చూసిన మర్చిపోలేనిదని.. మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుందని తెలిపారు. 

39

తిరుపతి, చుట్టుపక్కల వాళ్లకు స్వామివారి కుటుంబ సభ్యులమనే ఫీలింగ్ ఉంటుందన్నారు. మా స్వామి అనే ఫీలింగ్ ఉంటుందని.. ఎక్కడికైనా తిరుపతి వాళ్లు అని అప్యాయంగా పిలుస్తుంటారని చెప్పారు. తిరుపతిలో పుట్టడం, పెరగడం, చదవు కోవడం.. ఇప్పుడు మంత్రిగా అవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా తెలిపారు. 

49

స్వామివారి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులతో రాజకీయంగా ఎదుగుతున్నానని రోజా చెప్పారు. ప్రజలకు మరింత సేవ చేసే, శత్రువులను ఎదుర్కొనే  శక్తిని ఇవ్వాలని భగవంతున్ని కోరుకున్నట్టుగా చెప్పారు. 

59

ఈ సందర్భంగా రోజా తన కూతురు అన్షు మాలిక  సినీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్ చేయడం తప్పని తాను ఎప్పుడూ అనని రోజా చెప్పారు. తన కొడుకు, కూతురు యాక్టింగ్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి వస్తే తాను సంతోషంగా ఫీల్ అవుతానని చెప్పారు. తన కూతురికి చదువుకోవాలని, సైంటిస్ట్ అవ్వాలనే ఆలోచన ఉందని తెలిపారు. 

69

తన కూతురు ప్రస్తుతం బాగా చదువుకుంటుందని.. ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. సినిమాల్లోకి వస్తే మాత్రం ఒక తల్లిగా, హీరోయిన్‌గా తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. 

79

ఇదిలా ఉంటే.. మంత్రి రోజా తన బర్త్ డేను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె సన్నిహితులు, జబర్దస్త్ వర్ష, ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరి ఇంద్రావతితో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 

89

మంత్రి ఆర్కే రోజా బర్త్ డే సెలబ్రేషన్స్.. తన  పుట్టినరోజుని పండ్లతో వినూత్నంగా జరిపేందుకు వచ్చిన మిత్రులు, శ్రేయోభిలాషులకి ఆమె థాంక్స్ చెప్పారు. 

99

మంత్రి ఆర్కే రోజా బర్త్ డే సెలబ్రేషన్స్.. తన  పుట్టినరోజుని పండ్లతో వినూత్నంగా జరిపేందుకు వచ్చిన మిత్రులు, శ్రేయోభిలాషులకి ఆమె థాంక్స్ చెప్పారు. 

click me!

Recommended Stories