ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండురోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది...కొన్ని ప్రాంతాల్లో మరింత పెరిగి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్షతీవ్రత ఎక్కువగా వున్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రేపు ఎలాగు ఆదివారం కాబట్టి స్కూళ్లకు సెలవు వుంటుంది. సోమవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశమున్న జిల్లాల్లో సెలవులు ప్రకటించనున్నారు.
ఇవాళ(శనివారం) విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కాకినాడలో నేడు నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసారు. మిగతాజిల్లాల్లో కూడా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నారు.