పవన్ టార్గెట్ చేసేవాళ్లు మొదట పెళ్లి ప్రస్తావనతోనే విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అయితే, ఇప్పుడు పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ మరోసారి మూడు పెళ్లిళ్ల విషయం లేవనెత్తవద్దంటూ.. పవన్ కు రాజకీయ మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించడమనేది జనసేన అధినేతకు ఊరట కలిగించే అంశం. ఇది ఒక రకంగా పవన్ కల్యాణ్ కు నైతిక బలం చేకూర్చినట్లయింది.
రేణూదేశాయి తన పోస్టులో రాజకీయంగా తన మద్ధతు పవన్ కు ఉంటుందని తెలిపారు. తన విషయంలో పవన్ చేసింది తప్పేనని పేర్కొన్నారు. పవన్ కు పెద్ద రిలీఫ్ కలిగించడంతో పాటు ఆయన రాజకీయంగా మైలేజీని పెంచేలా.. పవన్ డబ్బు మనిషి కాదని.. సమాజం, పేదలకు మంచి చేయాలనుకుంటారని రేణూ దేశాయ్ అన్నారు. అందుకోసమే కుటుంబాన్ని సైతం పక్కనబెట్టారని ఆమె ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ తో పాటు సీఎం జగన్ కు కౌంటర్ గా భావించవచ్చు. ఎందుకంటే పలుమార్లు జగన్ సైతం పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు.
ys jagan
సీఎం జగన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ పవన్ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించారు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, రౌడీలా అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనలా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని నాలుగేళ్లకు భార్యను మార్చలేము.. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డుమీదకు తీసుకురాలేమంటూ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan's ex-wife renu desai revealed the painful facts of her heart problem
మూడు పెళ్ళిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, రౌడీ అంటూ టార్గెట్ చేసిన ప్రతిసారి పవన్ కౌంటర్ అటాక్ చేస్తున్నా వైకాపా నేతలు మాత్రం ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. అయితే, ఇప్పుడు రేణూ దేశాయ్ మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపాలంటూ వైసీపీ గురించి ప్రస్తావించకుండా పరోక్షంగా సీఎం జగన్ కు కౌంటరిచ్చారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఎన్నడూ లేని విధంగా తారాస్థాయికి చేరుకున్నాయి. రాజకీయాలంటే అసహ్యించుకునే విధంగా వ్యక్తిగత విమర్శలు తగవనే ముచ్చట వస్తున్నా... దానికి అదుపులేకుండా పోయింది. పవన్ సైతం వ్యక్తిగత విమర్శలు మాని రాజకీయంగా పోటీకి రండి అంటూ పలుమార్లు వైసీపీని టార్గెట్ చేశారు. ఇప్పుడు రేణూదేశాయి పవన్ కు సపోర్టు చేస్తూ.. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. వైసీసీ అండ్ సీఎం జగన్ కు కౌంటరిస్తూ.. పిల్లలను, కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. తన పిల్లలనే కాదు.. ఎవరి పిల్లలను ఇందులోకి లాగొద్దని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.
Janasena Party Formation Day
మొత్తంగా పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా రేణూదేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన అధినేతకు పెద్ద రిలీఫ్ కలిగించాయని చెప్పవచ్చు. ఇదే సమయంలో అధికార పార్టీ నాయకుడు సీఎం జగన్ కు చురకలంటించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే ముందు కాస్తా ఆలోచించాల్సిన పరిస్థితిని ఆయన రాజకీయ ప్రత్యర్థులకు రేణూ దేశాయ్ కల్పించారు.