అభివృద్ధి అంతా చంద్రబాబు చేసిందే.. ఇక వైసీపీకి మృత్యుగంటలు.. రఘురామ

First Published May 30, 2023, 9:12 AM IST

వైసీపీకి మృత్యగంటికలు మోగుతున్నాయని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. అభివృద్ది అంతా చంద్రబాబు చేసిందేనన్నారు. 

ఢిల్లీ : వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు.  చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తరువాతి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని.. అహర్నిశలు పాటుపడ్డారని.. అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబు నిలిచారని  ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

మహానాడులో ప్రవేశపెట్టిన తొలి మేనిఫెస్టోపై ఆయన వ్యాఖ్యానించారు.  మేనిఫెస్టోలో నాలుగు కీలక అంశాలు ఉన్నాయని.. వాటిని చూసిన మహిళలు, యువత అందరూ కూడా ఒక్క ఓటు తప్పిపోకుండా టీడీపీకి వేస్తారన్నారు. ఈ మాటలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు.  చంద్రబాబు నాయుడు చేస్తాను అని చెబుతున్నది.. నిజమైన సంక్షేమం  అని తెలిపారు.

ఇక టిడిపి మేనిఫెస్టో చూసిన తర్వాత తమ పార్టీలో వారికి నిద్రలు పట్టడం లేదు. పనిగట్టుకుని కొంతమందిని రంగంలోకి దింపింది. వారి పని విమర్శలు గుప్పించడమే. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం మహానాడుకు టిడిపి శ్రేణులు వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించింది. అయినా కూడా లక్షలాదిమంది తరలివచ్చారు.

మహానాడులోని ఆ జన సందోహాన్ని చూస్తే.. అధికార పార్టీ అయిన.. మా సొంత పార్టీ వైసీపీ  ప్రభుత్వానికి మృత్యుగంటలు మోగుతున్నాయని.. స్పష్టంగా అర్థమవుతుంది. సంక్షేమం.. సంక్షేమం.. అంటూనే.. రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసింది మా పార్టీ..’ అంటూ ధ్వజమెత్తారు. 

రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలను పరిశ్రమల్లో వాటాలు అడుగుతూ ప్రభుత్వ పెద్దలు తరిమికొట్టారని విమర్శించారు.ఇలా రాష్ట్రానికి రావలసిన ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.

Chandrababu

చంద్రబాబునాయుడు పేరు ఓటుకు నోటు అభియోగపత్రంలో లేదని గుర్తు చేశారు. అయినా కూడా జగన్ చంద్రబాబు నాయుడుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారన్నారు.  

కానీ,  ప్రస్తుతం వైఎస్ వివాకానంద రెడ్డి హత్య కేసు అభియోగపత్రంలో జగన్ పేరు ఉందన్నారు.  అయినా కూడా దానిమీద జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంజాయిషీ ఇవ్వడం లేదన్నారు. 

ఈ కేసులో వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సిబిఐ సుప్రీంకోర్టులో సవాలు చేయాలని రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కోరారు.

click me!