పులిచింతల ఎఫెక్ట్... ప్రకాశం బ్యారేజీకి ఫ్లాష్ ఫ్లడ్... విపత్తుల శాఖ అప్రమత్తం

First Published Aug 5, 2021, 10:56 AM IST

పులిచింతల గేట్ ఊడిపోవడంతో భారీగా నీరు దిగువకు వెళుతోంది. దీంతో కేవలం 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు చేరి ఫ్లాష్ ఫ్లడ్ ఏర్పడనుందని అధికారులు తెలిపారు. 

విజయవాడ: పులిచింతల ప్రాజెక్ట్ (కేఎల్ రావు సాగర్) గేట్ గురువారం తెల్లవారుజామున 3.10గంటలకు సాంకేతిక కారణాలతో 16వ నెంబర్ గేట్ ఊడిపోయిందని కృష్టా జిల్లా కలెక్టర్ జె నివాస్ వెల్లడించారు. ఇలా గేట్ ఊడిపోవడంతో భారీగా ప్రాజెక్ట్ లోని నీరు భారీగా దిగువరకు వెళుతోంది... కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వరద ముంపు ప్రభావిత అధికారులను కూడా కలెక్టర్ నివాస్ అప్రమత్తం చేశారు.

''ఊడిపోయిన గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రాజెక్ట్ లో నీటి నిల్వ తగ్గించాల్సి వుంటుంది. లేదంటే ఆ నీటి ఒత్తిడి ఇతర గేట్లపై పడే అవకాశం ఉంది. ఇలా పులిచింతల నుండి నీటిని వదలడంతో కేవలం 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు చేరి ఫ్లాష్ ఫ్లడ్ ఏర్పడనుంది. ఈ దృష్ట్యా అధికారులు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలి'' అని కలెక్టర్ హెచ్చరించారు.

''పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ఉండగా ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులు వుంది. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు కాగా ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉంది'' అని తెలిపారు.
undefined
''పులిచింతల నుండి భారీగా నీరు దిగువకు వెళుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. చేపల వేటకు నదిలోకి వెళ్లరాదు. అలాగే కృష్ణానది సమీపంలోని వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం కూడా చేయరాదు'' అని కలెక్టర్ నివాస్ సూచించారు.
undefined
విపత్తుల శాఖ కమీషనర్ కన్నబాబు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. పులిచింతల నుండి నీటిని దిగువకు వదలడంతో ప్రకాశం బ్యారేజ్ కి వరద‌ ఉధృతి పెరగనుందన్నారు. కాబట్టి కృష్ణా , గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా వుండాలని ఆదేశించారు. నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... నదినిదాటే ప్రయత్నం చేయరాదని కన్నబాబు సూచించారు.

click me!