తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Photos)

Published : Dec 05, 2022, 12:14 PM ISTUpdated : Dec 05, 2022, 12:15 PM IST

తిరుపతి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారమే తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి రాత్రి పద్మావతి విశ్రాంతి భవనంలో బసచేసారు. ఇవాళ ఉదయం విశ్రాంతిభవనం నుండి నేరుగా స్వామివారి పుష్కరిణికి చేరుకుని పక్కనేవున్న వరాహస్వామిని దర్శించుకున్నారు. అక్కడినుండి ప్రధాన ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి వేంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు.   

PREV
16
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Photos)
president murmu visits droupadi murmu

శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి సాదరస్వాగతం పలికారు. వీరి రాకకు ముందే దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసారు. 

26
president murmu visits droupadi murmu

రాష్ట్రపతికి తిరుమల అర్చక బృందం సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభాన్ని నమస్కరించుకున్న రాష్ట్రపతి ఆ తర్వాత ప్రధాన ఆలయానికి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 

36
droupadi murmu

శ్రీవారి దర్శన సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట పెద్దజీయంగార్‌, చిన్నజీయంగార్‌ స్వాములు వున్నారు.  ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు రాష్ట్రపతి ముర్ముకు తిరుమల ఆలయ చరిత్రను వివరించారు. 

46
president murmu visits droupadi murmu

వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం రంగనాయకులు మండపానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.  ఛైర్మ‌న్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను ద్రౌపతి ముర్ముకు అందజేశారు.

56
president murmu visits droupadi murmu

రాష్ట్రపతి ముర్ము వెంట కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు నారాయణ స్వామి, సత్యనారాయణ, రోజా, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ,  జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి , అదనపు డిజి రవిశంకర్ అయ్యర్ , డిఐజి రవిప్రకాష్ , సివి ఎస్వో నరసింహ కిషోర్ , తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి ఇతర అధికారులు వున్నారు. 

66
president murmu visits droupadi murmu

రాష్ట్రపతి ముర్ము పర్యటన వేళ తిరుపతి, తిరుమలలో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్రపతి దర్శనఏర్పాట్లు చేసారు టిటిడి అధికారులు. 

click me!

Recommended Stories