సకాలంలో ఆక్సిజన్ అందించి... కరోనా పేషెంట్స్ ప్రాణాలు కాపాడిన ఎస్పీ

First Published Apr 26, 2021, 5:11 PM IST

హాస్పిటల్ కు ఆక్సిజన్ ను తరలిస్తున్న లారీని బాగుచేయించి ఆక్సిజన్ ను గమ్యస్థానానికి చేర్చి కరోనా పేషెంట్స్ ప్రాణాలను కాపాడారు ప్రకాశం జిల్లా పోలీసులు. 

ఒంగోలు: దేశవ్యాప్తంగానే కాదు ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆక్సిజన్ కొరతతో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆక్సిజన్ ను తరలిస్తున్న ఓ లారీ సాంకేతిక సమస్యతో ఆగిపోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. వెంటనే లారీని బాగుచేయించి ఆక్సిజన్ ను గమ్యస్థానానికి చేర్చి కరోనా పేషెంట్స్ ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
undefined
విశాఖపట్నం నుండి ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి ఓ ట్యాంకర్ లారీలో ఆక్సిజన్ తరలించే ఏర్పాటు చేశారు. అయితే ఆక్సిజన్ ను నింపుకుని బయలుదేరిన లారీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రకాశం జిల్లా పంగులూరు మండలం నార్నేవారిపాలెం వద్ద ఆగిపోయింది.
undefined
ఆ లారీ వెంటనే కదల్లేదంటే ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్స్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో వారు మెకానిక్ లను తీసుకెళ్లి లారీని బాగుచేయించారు.
undefined
అంతేకాకుండా ఒంగోలు రిమ్స్ వరకు ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఎస్కార్ట్ ను లారీ వెంట పంపాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో సరయిన సమయంలో లారీ రిమ్స్ కు చేరుకోవడంతో హాస్పిటల్ సిబ్బందితో పాటు పేషెంట్స్, వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా రోగుల ప్రాణాలకు ఇబ్బందులు కలగకుండా మానవతాదృక్పదంతో వ్యవహరించిన ఎస్పీని జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.
undefined
click me!