పృథ్వీపై అక్కసా, జగన్ మీద కోపమా..., పోసాని ఆసలు సమస్య ఇదే...

First Published | Jan 10, 2020, 11:26 AM IST

పృథ్వీ, పోసాని ఇద్దరూ ఒకే పార్టీ కోసం కృషి చేసినప్పటికీ.. మొదటి నుంచి ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టమౌతోంది. గతంలోనూ వీరిద్దరి మధ్య వచ్చిన సంభాషణలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.  ఎప్పుడు పృథ్వీ కాంట్రవర్సీ కామెంట్స్ చేసినా.. దానికి పోసాని వెంటనే కౌంటర్ ఇస్తూ వచ్చేవాడు.

పోసాని మురళీ కృష్ణ... పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల్లో తన మార్క్ నటన, విలక్షణ రీతిలో డైలాగులు పలికి... మెప్పించడంలో ఆయన దిట్ట. కేవలం సినిమాలకే ఆయన పరిమితం కాలేదు. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కి ఆయన అండగా నిలిచారు. ఎన్నికల్లో తన పరిధి మేరకు పార్టీ కోసం కృషి చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా తన గొంతు వినిపించాడు.
undefined
ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్... ఆ పార్టీ నేతలపై విపరీతంగా విరుచుకపడేవాడు. తీరా... ఆయన అంతలా కష్టపడిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన కాస్త సైలెంట్ అయినట్లు అనిపించింది. తాజాగా... ఆయన మరోసారి రాజకీయాల గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు రావడం తీవ్ర సంచలనం రేపింది.
undefined

Latest Videos


అందులో... ఆయన ఏ పార్టీ కోసమైతే కష్టపడ్డాడో.. అదే పార్టీ కోసం కష్టపడి.. ఓ కీలక పదవిలో కొనసాగుతున్న మరో నటుడు పృథ్వీపై పోసాని ఘాటు విమర్శలు చేశాడు. సాధారణంగా... ఒకే పార్టీ చెందిన ఏ ఇద్దరు నేతలు ఒకరిని మరొకరు విమర్శించరు. అలా మాట్లాడాల్సిన సందర్భమే వస్తే... తెలివిగా తప్పించుకుంటారు. కానీ.. రాజధాని రైతులపై పృథ్వీ చేసిన కామెంట్స్ పై పోసాని ఎప్పుడూలేని విధంగా మండిపడ్డాడు.
undefined
అయితే...పృథ్వీ, పోసాని ఇద్దరూ ఒకే పార్టీ కోసం కృషి చేసినప్పటికీ.. మొదటి నుంచి ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టమౌతోంది. గతంలోనూ వీరిద్దరి మధ్య వచ్చిన సంభాషణలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడు పృథ్వీ కాంట్రవర్సీ కామెంట్స్ చేసినా.. దానికి పోసాని వెంటనే కౌంటర్ ఇస్తూ వచ్చేవాడు.
undefined
గతేడాది జగన్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత... పృథ్వీ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వడం... సినీ ప్రముఖులు చాలా మందికి ఇష్టం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరూ కనీసం జగన్ ని అభినందించలేదని పృథ్వీ పేర్కొన్నారు.
undefined
ఆ కామెంట్స్ అప్పుడు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాగా.. ఆకామెంట్స్ పై చాలా మంది ప్రముఖులు స్పందించి కౌంటర్ ఇవ్వగా.. పోసాని కూడా ఆ కామెంట్స్ పై మండిపడ్డాడు.
undefined
ఆ తర్వాత జగన్ కేబినేట్ లోకి పోసాని కి మంత్రి పదవి అంటూ వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని పృథ్వీ కూడా ఒకానొక సందర్భంలో పేర్కొన్నారు. పోసానికి మంత్రి పదవి ఇస్తారంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై కూడా పోసాని స్పందించాడు. తనకు ఎలాంటి మంత్రి పదవి అవసరం లేదని.. తనకు పదవులు అవసరం లేదని తేల్చి చెప్పారు.
undefined
పోసాని అలా చెప్పినప్పటికీ... ఆయనకు మంత్రి పదవి కాకపోయినా ఏదైనా కీలక పదవి రావడం ఖాయమని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ... జగన్... పోసానికి కాకుండా పృథ్వీ కి ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ఇచ్చారు.
undefined
పృథ్వీకి ఆ పదవి కట్టబెట్టిన తర్వాత మళ్లీ పోసాని కనిపించలేదు. తాజాగా... మళ్లీ రంగంలోకి దిగారు. పృథ్వీపై వీర రేంజ్ లో మండిపడ్డాడు. రైతులను కించపరుస్తావా అంటూ ఫైర్ అయ్యాడు.
undefined
రాజధాని వివాదం చాలా కాలంగా నడుస్తోంది. చాలా మంది మంత్రులు, వైసీపీ నేతలు ఈ విషయంలో తమకు తోచిన విధంగా కామెంట్స్ చేశారు. దానిపై ఎప్పుడూ నోరు విప్పని పోసాని.. సడెన్ గా పృథ్వీ ఒక్కమాట అనగానే ఎందుకు ఇంతలా రియాక్ట్ అయ్యాడా అనే సందేహాలు ఎక్కువగా వినపడుతున్నాయి.
undefined
తనకి కాకుండా.. పృథ్వీకి జగన్ పదవి కట్టపెట్టడంపై పోసాని అసంతృప్తితో ఉన్నాడని... దానిని ఈ విధంగా ఇలా వ్యక్తపరిచాడనే వాదనలు వినపడుతున్నాయి. అందుకే ఇలా మాట్లాడనని కొందరు భావిస్తున్నారు. పృథ్వీ కారణంగానే జగన్ పరువు అంతా పోతోందని పోసాని వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మరి పోసాని కామెంట్స్ పై పృథ్వీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
undefined
click me!