పోసానిని అరెస్ట్ చేసిన కేసు ఇదేనా?
వైసిపి అధికారంలో ఉండగా పోసాని కృష్ణమురళి టిడిపి, జనసేన నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ముఖ్యంగా చంద్రబాబు,లోకేష్, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు. వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు.
ఇలా గతంలో అధికారపార్టీ అండతో మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు పోసాని. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి... ఇలా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసులోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పోసానిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసారు పోలీసులు.. సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద ఆయనను అరెస్ట్ చేసారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై ఈ కేసులు పెట్టారు. ఆయనను హైదరాబాద్ నుండి రాజంపేటకు తరలించి అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు.
పోసాని కృష్ణమురళి అరెస్ట్ విషయాన్ని ఏపీ పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. బుధవారం ఉదయమే ఏపీ నుండి ఓ ఎస్సై, ఐదుగురు కానిస్టేబుల్స్ హైదరాబాద్ కు చేరుకున్నారు... పోసాని అరెస్ట్ గురించి రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోసాని ఇంట్లో ఉన్న సమయాన్ని చూసి ఒక్కసారిగా వెళ్ళి అరెస్ట్ చేసారు.