ఈ ఏనుగులకు శిక్షణ ఎలా ఇస్తారు.?
ఏనుగులు చిన్న వయసులోనే ఉన్నప్పుడే మానవులు వాటిని మచ్చిక చేసుకుంటారు. అనుభవజ్ఞులైన ఏనుగుల కాపరులు వీటికి శిక్షణ ఇస్తారు. మనుషుల ఆదేశాలను అనుసరించేలా ఏనుగులకు కఠినమైన శిక్షణ అందిస్తారు. భారత్‌లో ఈ కుంకీలు ఎక్కువగా అసోం, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్‌లో ఈ ఏనుగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.
ఏనుగు చెవిని కాలితో తడితే.. ఏనుగు ముందుకు వెళ్తుంది. చెవి వెనక భాగంలో కాలి తొడతతో గట్టిగా తడితే అప్పుడు వెనుకకు వెళ్తాయి. చెవి మధ్యభాగంలో అదిమితే ఏనుగు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇలా మావటి ఇచ్చే సిగ్నళ్లకు అనుగుణంగా కుంకీలు ప్రవరిస్తాయి. ఇతర ఏనుగులను తరిమికొట్టే క్రమంలో ఇవి గట్టిగా అరుస్తాయి. ఇలా చేయడానికి మావటిలు వాటికి ఒక సంకేతాన్ని ఇస్తారు. ఇలా ఇతర ఏనుగుల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గిస్తారు.