పవన్ శాఖలకు అవార్డుల పంట :
కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్నిరాష్ట్రాల పంచాయితీల పనితీరును పరిశీలించి అత్యుత్తమమైన వాటికి అవార్డులు అందిస్తుంది. ఇలా ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’ లను పంచాయితీలను అందిస్తుంది. అయితే ఈసారి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నాలుగు పంచాయితీలు వివిధ విభాగాల్లో ఈ అవార్డులను దక్కించుకున్నాయి.
దేశంలోనే ఆరోగ్యవంతమైన పంచాయితీ విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం అవార్డు కైవసం చేసుకుంది. ఇక సమృద్దికరంగా జలవనరుల (వాటర్ సఫిషియెంట్) విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, పచ్చదనం-పరిశుభ్రత (క్లీన్ అండ్ గ్రీన్) విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి టాప్ లో నిలిచాయి. చివరగా సామాజిక న్యాయం-సామాజిక రక్షణ (సోషల్లీ జస్టిస్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్) పంచాయత్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళకు అవార్డు దక్కింది.
ఈ అవార్డులు పవన్ కల్యాణ్ పనితీరు ఎలావుందో తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఒకేసారి రాష్ట్రంలోని పంచాయితీలన్నింటికి గ్రామసభలు నిర్వహించి రికార్డ్ సృష్టించారు పవన్. ఇప్పుడు మరోసారి అవార్డుల ద్వారా తన పనితీరు ఎంత అద్భుతంగా వుందో తెలియజేసారు.