రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు.. నాదెండ్ల

Published : Sep 02, 2023, 10:53 AM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా  ఘనంగా నిర్వహించామని నాదెండ్ల మనోహర్ అన్నారు. 

PREV
16
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు.. నాదెండ్ల

విజయవాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకలను ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. 

26

ప్రభుత్వం విధానాల వల్ల దెబ్బ తిన్న రంగాల వారితో కలిసి సహపంక్తి భోజనాలు, అల్పాహారం చేశామని తెలిపారు. పవన్  కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, పేదలకు చేయూతను ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాం.. అన్నారు. 

36

జగన్ అనాలోచితంగా చేసిన నిర్ణయాలతో లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారు. భవన నిర్మాణ కార్మికులు నేటికీ అనేక ఇబ్బందులు పడుతున్నారు.

46

నాలుగేళ్లల్లో జగన్ కార్మికులు జీవితాలను నాశనం చేశారు. కార్మికులు కష్టం వింటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి.

56

బటన్ నొక్కే కార్యక్రమాలతో ఆర్భాటం చేయడం కాదు. పేదలు, కార్మికులు కడుపు నింపే పనులు చేయాలి అంటూ ఎద్దేవా చేశారు.

66

అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో కార్మికులు తో కలిసి టిఫిన్ చేశాం. వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వం అధికారం లోకి వస్తుంది.. కార్మికులను ఆదుకుంటాం.. అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories