పార్కు చేసి ఉన్న టు వీలర్ ని, మృతుడి జేబులో ఉన్న ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో సత్యనారాయణ సూసైడ్ నోట్లో రాశాడు. అందులో.. గత నాలుగేళ్లుగా సుజాత తనకు తెలుసని.. కానీ గత కొద్ది రోజులుగా దూరం పెడుతుందని రాసుకొచ్చాడు. తాను ఆమెను నమ్మి తాళి కూడా కట్టానని, కొద్ది రోజులుగా తనని అవమానిస్తుందని చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలోనే ఆమెని చంపేయాలని నిర్ణయించుకుని ఆదివారం రాత్రి ఇంటికి పిలిపించానని.. ఆ తర్వాత ఆమె గొంతు కోసి చంపేశానని పేర్కొన్నారు. ఈ సూసైడ్ నోట్ పోలీసులకు సత్యనారాయణ ఇంట్లో దొరికింది. అయితే ముందుగా సత్యనారాయణ చనిపోయిన విషయం రైల్వే పోలీసులు బంధువులకు తెలిపారు. దీంతో వారు ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో సుజాత మృతదేహం కనిపించింది.