ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛన్నయుద్ధం: అధికారులకు తలనొప్పులు

Published : Jun 18, 2021, 01:16 PM IST

గుంటూరు జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం అధికారులకు తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. 

PREV
18
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛన్నయుద్ధం: అధికారులకు తలనొప్పులు

గుంటూరు జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య  ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతకాలం ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత నెలకొందనే ప్రచారం ఒట్టిదేనని తేలింది.  ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛన్న యుద్దం కారణంగా అధికారులకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

28

గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ మధ్య  ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. వీరి మధ్య  సఖ్యత లేకపోవడం అధికారులకు కూడ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ వ్యవహరంతోనే చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

38
2019 ఎన్నికల తర్వాత చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ, ఎంపీ కృష్ణదేవరాయల మధ్య ఎలాంటి విబేధాలు లేవు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత మర్రి రాజశేఖర్ రెడ్డికి ఎంపీ కృష్ణదేవరాయలు వత్తాసు పలుకుతున్నాడని రజనీ వర్గీయులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పెరిగిందని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

48

చిలకలూరిపేటలో ఎంపీ కృష్ణదేవరాయలు పర్యటించిన సమయంలో  ఎమ్మెల్యే రజనీ వర్గీయులు  అడ్డుకొనేవారు. చిలకలూరిపేటలో ఏ  కార్యక్రమం జరిగినా ఎంపీకి సమాచారం అందేది కాదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ వచ్చిన సమయంలో కూడ ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకొన్న సందర్భాలు కూడ ఉన్నాయి. 

58

ఇటీవల కాలంలో చిలకలూరిపేటలో వందలకోట్లతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల్లో ఎంపీ కృష్ణదేవరాయలుకు ఆహ్వానం అందింది. ఆ కార్యక్రమానికి హాజరైన ఎంపీతో ఎమ్మెల్యే రజనీ మాట్లాడారు. 

68

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత  ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా రోగులకు సౌకర్యాలపై ఎంపీ కృష్ణదేవరాయలు పరిశీలించారు. ఎంపీ పర్యటించిన మరునాడే ఎమ్మెల్యే రజని కూడ ఈ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సేవలు తదితర అంశాలపై పరిశీలించారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై చర్యలు తీసుకోవాలని  ఎమ్మెల్యే రజని  కలెక్టర్ ను కోరారు. 
 
78

ఇదిలా ఉంటే  జగనన్న ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు  ఒకే వేదికను పంచుకొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కృష్ణదేవరాయలును మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో  ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ పై ఎంపీ కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించారు.  మున్సిపల్ కమిషనర్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. 

88

ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేని కారణంగా తమకు తలనొప్పులు వచ్చిపడుతున్నాయని అధికారులు తలలు పట్టుకొంటున్నారు. ఏ కార్యక్రమానికి ఎవరిని ఆహ్వానిస్తే ఎవరికి కోపం వస్దోందోననే ఆందోళనతో అధికారులున్నారు. 

click me!

Recommended Stories