శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలోని సావురకోట కోదడ్డపనసలో వెలుగు చూసిన జంట హత్యల కేసులు నిందితుడైన ముద్దాడ రామారావు.. ఇద్దరిని హత్య చేసిన తర్వాత.. తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన ఈ విషాద ఘటనలో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు, ఆత్మహత్యలు జరిగినట్లుగా తేలింది.